త్యాగమూర్తులు తల్లిదండ్రులు:- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడుసెల్:9966414580
త్యాగానికి ప్రతీకలు
కాంతిలీను క్రొవ్వొత్తులు
జగతిలో తల్లిదండ్రులు
నింగిలో  రవిచంద్రులు

అద్భుతమైన సేవలు
సాటిలేనివి ప్రేమలు
అమ్మానాన్నలు ఇలలో
కనిపించే ఇలవేల్పులు

కన్నోళ్లను మించినోళ్లు
ఎక్కడా లేరు లేరు
వారి వంటి గొప్పవారు
వెదికినా గాంచలేరు

నిరంతరం కృతఙ్ఞతలు
కన్నవారికి తెలపాలి
అవసాన దశలోన
ప్రేమగా చూడాలి


కామెంట్‌లు