శంకరాచార్య విరచిత - ఉమా మహేశ్వర స్త్రోత్రం :-కొప్పరపు తాయారు

 శ్లో కం :
నమః శివాభ్యాం రథవాహనాభ్యాం
రవీందువైశ్వానరలోచనాభ్యామ్ ।
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 9 ॥


పదార్థ వివరణ
నమః శివాభ్యాం – శివపార్వతీ దేవతలకు నమస్కారం
రథవాహనాభ్యాం – రథం ఎక్కి సంచరించే దంపతులకు
(ఇక్కడ "రథం" అనేది దేవయానం, దేవతల దివ్యవాహనం అని భావించాలి)
రవీందు-వైశ్వానర-లోచనాభ్యామ్ –
శివుని కన్నులు సూర్యుడు (రవి), చంద్రుడు (ఇందు) మరియు అగ్ని (వైశ్వానర) వంటి తేజస్సు కలవిగా ఉండడం
పార్వతీ దేవి కన్నులు కూడా అలానే ప్రకాశంగా ఉండడం
రాకాశ-శాంకాభ ముఖాంబుజాభ్యాం –
పార్వతీ దేవి ముఖకమలం పౌర్ణమి చంద్రునిలా శోభించే
శివుని ముఖం కూడా చంద్రమండలంలా దివ్యంగా వెలిగే
నమో నమః శంకరపార్వతీభ్యామ్ – శంకరపార్వతీ దేవతలకే తిరిగి తిరిగి నమస్కారం
భావార్థం
రథవాహనంగా విహరించే శివపార్వతీ దేవతలకు,
వారి కన్నులు సూర్యుడు, చంద్రుడు, అగ్ని వంటి తేజస్సుతో ప్రకాశిస్తూ,
పౌర్ణమి చంద్రునివలె సుందరంగా శోభించే ముఖకమలములు కలిగిన
శంకరపార్వతీ దంపతులకు
పునః పునః నమస్కారాలు.
             ********
కామెంట్‌లు