నడుస్తున్న పేజీలో కథనం: - -గుండు మల్లికార్జున రావు - బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు (జిల్లా),.
అన్నమయ్య అంతిమాన వేల కృతులు వెంకన్నకు 
.అప్పజెప్పె అదే ఆఖరి పేజీ 

గాంధీజీ ప్రజల ఉద్దేశించి చెప్పాలనుకున్న
 అంతిమ సందేశాన్ని అంతమొందించె గాడ్సే అదే ఆఖరి పేజీ 

సుభాష్ చంద్రబోస్ ఏకతాటిపై నడిపినప్రజా సైన్య
ఉద్యమాన్ని తట్టుకోలేక బ్రిటిష్ వారు పలాయనం చిత్తగించె
దేశం వదిలిపోయేరు క్విట్ ఇండియా ఆఖరు పేజీ 

ప్రతినిత్యం సూర్యోదయం ప్రకృతి పులకించి 
జీవకోటికి  ఆధారమైన వెలుగులు పంచి 
సందెవేళ మళ్ళవస్తానంటూ వెళ్లిపోయిన సూర్యుడు  
అదే ఆఖరి పేజీ 

శ్రమజీవులు ప్రాణాలకు తెగించి కూటి కోసం
 బొగ్గు గనులలో కూలి కెడితే కబళించే 
గనుల సొరంగాలు అదే ఆఖరి పేజీ 

అతివేగం అనర్థదాయకం, 
ప్రతినిత్యం ఆచితూచి చేయండి ప్రయాణం 
అని ఎంత చెప్పినా వినని యువత
అంతమైపోతుందడె అదే ఆఖరి పేజీ

జూదం, వ్యభిచారం, దొంగతనం 
తప్పుని ఎంత చెప్పినా వినని ప్రజానీకం 
తప్పులకు గొప్పలకు అలవాటు పడిన మానవాళి 
నడుస్తున్న పేజీలో కథనం

కామెంట్‌లు