పిలిస్తే
పలుకుతా
పరుగెత్తుకుంటూ వస్తా
పలికితే
ప్రతిస్పందిస్తా
పెదవుల తేనెలు చిమ్ముతా
ప్రేమిస్తే
పులకరిస్తా
పరమానంలో తేలిపోతా
పొగిడితే
పొంగిపోతా
పెద్దవాడినని భావిస్తా
ప్రశ్నిస్తే
జవాబుచెబుతా
నమ్మకం కుదిరిస్తా
పెడితే
పొట్టనింపుకుంటా
పరవశించిపోతా
పట్టుకుంటే
తడబడతా
తడుముకుంటూ నిలుస్తా
పోరాడితే
ఎదురుతిరుగుతా,
పరిరక్షించుకుంటా
పగ్గాలేస్తే
తెంచుకుంటా
బయటపడతా
ప్రాధేయపడితే
ఓపికగా వింటా
సాయం అందిస్తా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి