ఎదురుపడింది కదా అని
ఎవరెస్టును ఎక్కలేం
తలెత్తి చూడలేం
కాసేపు కళ్ళు మూసుకుంటే చాలు!!
కిందికి దిగింది కదా అని
ఆకాశాన్ని అందుకోలేం
నక్షత్రాలను లెక్కించలేం
కాసేపు కళ్ళు మూసుకుంటే చాలు!!!
భూమి తిరుగుతుంది కదా అని
మనమూ పరిగెత్తలేం .
కిందికి దూకలేం . భూమిని ఆపలేం .
కాసేపు కళ్ళు మూసుకుంటే చాలు!!!
నడిచే అడుగులు తప్ప
ఎగిరే
రెక్కలు లేని పక్షులం మనం!!!?
పాలెం మిత్రుడు శోభన్ కు నివాళి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి