సాహితీ కెరటాలు*
==============
ఆత్మవిశ్వాసం కాదెపుడూ అందరి సొత్తు!
అలవడు అది అందరిలో కొందరికే!
పరుగు పందెంలో గెలుపుకు, కావాలి పిక్క బలం!
ఈతలో నిలవాలంటే, నియంత్రించాలి ఊపిరి!
పరీక్షలో పాసవాలంటే, కావాలి శ్రద్ధ, పట్టుదల!
ఇల్లు కట్టాలంటే, కావాలి సక్రమ ప్రణాళిక!
స్నేహం కావాలంటే,సచ్చిలత, సద్భావన ముఖ్యం...
పోరులో గెలవాలంటే, కావాలి శారీరక,మస్తిష్క బలం!
కుటుంబాన్ని నడపాలంటే, కావాలి సత్సారథ్యం!
వివాహ బంధం నిలవాలంటే, కావాలి అంతులేని ప్రేమ!
ఆపద్బాంధవుడు అవ్వాలంటే, ఉండాలి ఆవగాహన!
వికలాంగుల రక్షణకు, సమయస్ఫూర్తి కావాలి!
వృద్ధులను ఆదుకొనుటకు, సహన శక్తి కావాలి!
మునిగిపోతుంటే కాపాడుటకు, ఈత తప్పక రావాలి!
అగ్ని బాధితుల నాదుకొనుటకు, సాహసం కావాలి!
ఏ పనికైనా వెనకాడక, ముందడుగు వేస్తుండాలి!
అన్ని రంగాల్లో గెలవాలంటే నిన్ను నువ్వు నమ్మాలి!
మనసు నీ అధీనమైతే, అన్నిటా విజయం నీదే!!
నిన్ను నువ్వు నమ్ము:- కోలా సత్యనారాయణ -విశాఖపట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి