కిసాన్ చాచీ!:- సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆమె అసలుపేరు రాజకుమారీదేవి కానీ అంతా ఆమెను కిసాన్ చాచీ,సైకిల్ స్త్రీ అనే పిలుస్తారు.బీహార్ లో కుగ్రామాల్లో గంజాయి,భంగ్, చరస్ వ్యాపారం బాగా జోరుగా సాగుతుంది.ఎంతోమంది జనం ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆపేది ఆమె.మత్తులో చిత్తయిన సంసారాలు,పొలంలో గంజాయి తప్ప వేరే పండించని భర్తలతో సతమతమయ్యేవారు .అలాంటివారికి వెలుగుబాట చూపింది కిసాన్ చాచీ!బంజరుభూమిలో ఏమీ పండవు అని తేల్చిన జనాలకి కనువిప్పు కలిగించింది.బొప్పాయి,మామిడి పనస,అరటి నాటించి అందరికీ దారి చూపింది.వాక్కాయ,లీచీ ఊరగాయలు పెడుతున్నారు మహిళలు.లెక్క డొక్క లు చాచి వల్ల నేర్చారు. ముగ్గురుపిల్లలతల్లి చాచీ పోలియో టీకా ప్రచారానికై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసింది. బ్యాంకాక్ మహిళారైతుల సమ్మేళనానికి హాజరైంది. 30ఏళ్లపైగా ఊరంతా సైకిల్ పై తిరుగుతూ ఉవిదలపాలిటి దేవత గా మారింది.🌹
కామెంట్‌లు