*****
"గాల్లెందవ్వా! నేనొచ్చిన కానుండి సూత్తున్నా ఆళ్ళు మొగుడు పెళ్ళాలా?పాకిత్తాన్ జెవాన్లు,మన జెవాన్ల లెక్క బద్ద శత్తురువులా? మాటల పంచాతీ,వీపు మోతల పంచాతీ - గిట్ల దినాం పంచాతే. సైన్మా లెక్కుంది సూడ్డాన్కి. గిటు పెద్దోళ్ళు గటు పెద్దోళ్ళు కూసోని గీ ఆల్మొమొగల సంగతేందో తేలుత్తె అయిపోద్ది గద.నిత్తెం గా రసరస,రుసరుస ఏందవ్వా?"
చాన్నాళ్ళకి పేట నించొచ్చిన సువర్ణకి పక్కింట్లె దినాం గాళ్ళ పంచాతి సూశి సూశి శికాకు పుట్టింది. గందుకే అవ్వతో గా మాటంది.
సువర్ణ మాటల్కి ఫక్కున నవ్విందవ్వ.
"ఏందవ్వా?గాళ్ళ పంచాతి సూడనీకి నీకు నిత్తెం సర్దాగా ఉందా?ఆళ్ళు తిట్టుకు,గుద్దుకు సత్తుంటే నీకు ముద్దుగుందేటి?" కూసింత నిట్టూరంగా అంటున్న సువర్ణ మాటల్కి...
నీ లెక్క నేను సుత ఆడుదాన్నే గదనే. నాకు మాత్తరం గాల్లట్ల పంచాతి పెట్కొంటె సూడ్డం ఇట్టమా ఏంది? నువ్వు పొద్దుగాల,మద్దేనం పంచాతి,లొల్లి జేసుడే సూత్తున్నవ్. నేను పొద్దు గుంకినంక గాళ్ళిద్దరూ సిలుకా గోరింకలొతికె కువకువలాడ్డం సుత సూత్తున్న.గందుకే నీ లెక్క గాళ్ళ లొల్లికి పరేషానవతల్లేదు.రంధి పడట్లే..."
"అవునా అవ్వా!బలే ఇచ్ఛింత్రంగుందే?పిల్లి ఎలుకలొతికె కాదు కాదు పందెం కోళ్ళ లెక్క ఒకలమీద ఒకలు ఎగబడ్డం సూశి గీళ్ళిద్దట్లె శివరాకరికి ఎవలో ఒకలె మిగుల్తరా ఏందని? బయమైంది తెల్సునా?"
"అద్దం మీద ఆవగింజస్మంటుంది గిస్మంటి మొగుడు పెళ్ళాల లొల్లి,పంచాతి.నున్నగున్న అద్దం మీద ఆవగింజైన,పెసరిత్తనమైన పడ్తే ఆగుతయా? శెప్పు.జర్రున జారిపోతై గద.గట్లనే గీళ్ళు సుత.సుట్టుపక్కలున్న అందర్కి తెల్సు... ఒకేల గాళ్ళ లొల్లి మద్దెకి గన్క పోయినమా? ఇంగ జూస్కో మనం అయిపోయినట్టె.ఇద్దరు కల్సి మన మీద్కి పొట్టేళ్ల లెక్క దూక్తరు. ఓ పాలి గాళ్ళ మద్దెకి ఎల్లి సూత్తవా మరి..."
"వామ్మో! అవ్వా! గింత ముచ్చటి జెప్పినంక సుత ఆళ్ళ జోలికి పోతనా ఏంది? గియ్యాల పొద్దుగూకినంక గాళ్ళని సిలుకా గోరింకల్లా సూడాల్నుంది.ఇంటెన్క గోడ కాడికెల్లి ముక్కాలి పీటెక్కి సూత్త."
"బాగనే ఉంది యవ్వారం.గదెక్కి జార్నవన్కో కాలో శెయ్యో బెన్కితే, ఇంగ మీ ఆయన్తో వుంటది అసలు లొల్లి" అంటుంటె సువర్ణ సిగ్గుల మొగ్గైంది.
"గదండీ సంగతి! అద్దం మీద ఆవగింజ గాని,పెసర గింజ గాని పడితే నిలకడగా ఉండవు.జారిపోతయి. అట్లనే మొగుడు పెళ్ళాల మద్దె లొల్లి, పంచాయతీ గూడ.గందుకే గీ సామెత పుట్టుకొచ్చింది మన ఎనకటోళ్ళ అనుభవాల నుంచి. మొగుడు పెళ్ళాలే కాదు ఎవరితో లొల్లి పెట్టుకున్నా గట్లనే ఉండాలే.మరి మీరేమంటరు?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి