సాహితీ కెరటాలు
సాహితీ కవి కళాపీఠం
=================
ఆరుగాలం చెమట చిందించే శ్రామికుడు .
ప్రజల ఆకలిని తీర్చే నిజ నాయకుడు.
విలాసాలు ఎరుగని నిత్య కృషివలుడు ,
కల్మషం లేని మన కర్షకుడు.
నీ ఒంటిలో నెత్తురు శత్రువుగా మారిన వైనం .
పుట్టేడు అప్పులతో జీవన గమనాలు అగమ్యం .
ఆలి పుస్తెలు సహితం తాకట్టుగా మారిన ధైన్యం .
...
పంచభక్ష పరమాన్నాలు తినే రాజైన ,
పచ్చడి మెతుకులు తినే పేదైనా ,
నీ రెక్కల కష్టానికి దాసోహం .
అతివృష్టి అనావృష్టి నీ తలరాతను మార్చే శాసనం.
అతివృష్టి, అనావృష్టి నీ తలరాతను మార్చే శాసనం.
ప్రకృతి ఆడే వింత జూదం ఈ వ్యవసాయం .
.
అతివృష్టి ఆపమని వరుణ దేవుణ్ణి అడిగేద్దామా!
అన్నావృష్టి ఇవ్వద్దని సూర్య భగవానుని ప్రార్థిద్దామా!
ప్రతి పంటకి ఉండాలి ఉచిత బీమా ,
అప్పుడే కదా పుడుతుంది వ్యవసాయం చేయాలని ధీమా.
మెతుకు మితుకులో మన బ్రతుకు రైతే రాజుని పలుకు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి