స్నేహితుల అంతా కలసి మాట్లాడుకుంటూ నఢుస్తున్నారు. అడవిలాంటి ప్రదేశంలో నడుస్తున్నారు. ఒకచోట విచిత్రమైన జంతువు కనబడింది. ఇంతవరకూ అటువంటి జంతువును చూడలేదు, అటువంటి జంతువు ఉంటుందని కూడా వినలేదు. క్రూర జంతువులా ఉంది. "బాబోయ్! ఆ జంతువు కంట పడ్డామా మనకు మూడిందే! దానికంట పడకుండా ఇక్కడ నుంచి జారుకోవడమే మంచిది." అన్నాడు వాసు. "పిరికివాడిలాగా ఉన్నావు. వెనక్కి జారుకోవడం ఎందుకు. దానికంట పడకుండా జాగ్రత్త పడి ముందుకే వెళ్దాం." అన్నాడు వేంకటరమణ. "మీరిద్దరూ పిరికివాళ్ళు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఆ జంతువు పక్కన నిలబడి, దానితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే లక్షల మంది దృష్టిలో పడతాము. మన ఇమేజ్ ప్రపంచమంతా వ్యాపిస్తుంది." అన్నాడు రాజేంద్ర. వద్దూ అని ఎంతమంది చెబుతున్నా ఆ జంతువు సమీపంలోకి వెళ్ళాడు రాజేంద్ర. ఈ పిచ్చోడి అత్యుత్సాహం తమ ప్రాణాల మీదికి వస్తుంది అని జారుకున్నారు అంతా.
రాజేంద్ర ఆ జంతువు పక్కన నిలబడి సెల్ఫీ దిగాలని ప్రయత్నించాడు. ఆ జంతువు రాజేంద్ర మీద దాడిచేసి తీవ్రంగా గాయపరచింది. తనను ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి దగ్గర్లో ఎవరూ లేరు. తన ప్రాణాలు పోవడం ఖాయం అని భయపడుతున్నాడు రాజేంద్ర.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి