శ్లో కం :
నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ ।
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 1 ॥
పదార్థం (పదానికిపదం అర్థం)
నమః శివాభ్యాం – శివపార్వతీ దేవులకు నమస్కారం
నవయౌవనాభ్యాం – ఎల్లప్పుడూ యౌవనంతో కాంతులతో మెరయువారికి
పరస్పరా-ఆశ్లిష్ట-వపుః-ధరాభ్యామ్ – పరస్పరం ఆలింగనం చేసుకున్నట్లుగా ఏకత్వంగా కనిపించే వారి రూపాలకు
నగేంద్రకన్యా – పార్వతీ దేవి (పర్వతరాజు హిమవంతుని కుమార్తె)
వృషకేతనాభ్యాం – ఎద్దు (నంది) ధ్వజంగా కలిగిన శివుడికి
నమో నమః – మరల మరల నమస్కారం
శంకరపార్వతీభ్యామ్ – శంకరుడు, పార్వతిదేవి – ఈ దివ్యదంపతులకు నమస్కారములు.
భావార్థం
ఎల్లప్పుడూ యౌవనభరితంగా, కాంతివంతమైన స్వరూపంతో,పరస్పరం ఏకమై ఉన్నట్లుగా కనిపించే పర్వతరాజు కుమార్తె పార్వతీదేవి మరియు వృషభం చిహ్నంగా కలిగిన శంకరుడికి
మళ్ళీ మళ్ళీ నా నమస్కారాలు.
సారాంశం
ఈ శ్లోకం శివపార్వతీ దివ్యదంపతుల ఏకత్వాన్ని, శుభతను, శ్రేయస్సును స్మరించి నమస్కారంగా పలకబడుతుంది.
*******
శంకరాచార్య విరచిత - ఉమా మహేశ్వర స్త్రోత్రం :- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి