వింతలు విడ్డూరాలు!:- సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 పంజాబ్ రాజు రంజిత్ సింహ్ భోజన ప్రియుడు.144 మంది వంటవాళ్లుండేవారు. అందులో 16మంది కేవలం ఎగ్ కర్రీ చేసేవారు. జునాఘడ్ నవాబు మహావత్ ఖాన్ కుక్కల్నిపెంచి  వాటికిఫ్యాన్లు లైట్లతో బెడ్రూం ఏర్పాటుచేశాడు.కుత్తాకర్ అని కుక్కలపై పన్నుని జనాలనుంచి వసూలుచేసిన ప్రబుద్ధుడు.ఆడకుక్క పెళ్లికి 10లక్షలు ఖర్చు పెట్టాడు.తనకుక్కలకి సలాంపెట్టమని ఆజ్ఞజారీచేసిన బుర్ర తిరుగుడు నవాబు!!
కాశ్మీర్ రాజుకి క్రికెట్ పిచ్చి.3గంటలకి గ్రౌండ్ కి వచ్చేవాడు.సేవకులు ఇద్దరు సాక్స్ తొడిగేవారు.ఔట్ అని చెప్పేదమ్ము లేదెవ్వరికీ. అలసిపోయా అని రాజుఅంటే  ఎల్.బి.డబ్లు అనేవారు.ఇక రకరకాల వ్యక్తులు ముఖ్యంగా ఆంగ్లేయుల అలవాట్లు హాబీలు విచిత్రంగా ఒళ్లు గరిపొడిచేలా ఉంటాయి.ఎడాల్ఫ్ హక్స్ లే  పుస్తకాలు చదివి అలసిపోతే బ్రెయిలీలిపి పుస్తకాలు చదివేవాడు.జాన్ హక్ల్సే అనే రచయిత చిరిగిన చెప్పులు వేసుకునేవాడు. కొత్తవి విని వాటిని చింపి అవి మళ్లీ కుట్టించి తొడుక్కునేవాడు. లార్డ్ బైరన్ నిద్ర పోయేముందు 2 పిస్తోళ్లు చేత్తో పట్టుకుని గదిలో పచార్లు చేసేవాడు.లార్డ్ గార్డెన్ స్టోన్ తన బెడ్రూమ్ లో మానవ కంకాళం,,పుర్రె భయంకర చిత్రాలు,విరిగిన వస్తువులు పెట్టుకున్న పేద్ధ సైకో!?ఫ్రెంచ్ కవిఛార్లెస్ సైమన్ రచన చేసేముందు ఓరోజంతా తలను పడకపై రుబ్బుడుపొత్రంలా దొర్లించేవాడు. డాక్టర్ జాన్సన్ మార్నింగ్ వాక్ కి వెళ్తూ ప్రతి కరెంట్ స్తంభాన్ని తాకి లెక్క పెట్టేవాడు.లెక్క మర్చిపోతే మళ్లీ వెనక్కి వచ్చి"ఒకటి రెండు... అంటూ స్తంభాలను తాకి లెక్క పెట్టేవాడు.బహుశః బడిలో ఒంట్లు రావాలని అలా ఆటలా నేర్పారేమో!?🌹
కామెంట్‌లు