ఆహా…! ఓహో…! ఔరా…!
ఇది కదా ఏకాగ్రతా
ఎవరెస్టు శిఖరమంటే…
వీరు కదా ఏకలవ్య శిష్యులంటే...
వీరు కదా ప్రతిభకు ప్రతిరూపాలంటే..!
వీరు కదా కొండలను
చూర్ణం చేసే దీక్షాసముద్రాలంటే…
వీరు కదా స్ఫూర్తి సూర్యకిరణాలంటే...
వీరు కదా ఎడారిలో ఒయాసిస్‌లంటే...
ఆశలు నింపే అద్భుత ప్రత్యూషాలంటే…!
వీరు కదా ప్రతిభకు ప్రతిబింబాలంటే..
వీరుకదా కఠోరశిక్షణకు ప్రత్యక్ష సాక్షులంటే
వీరు కదా భరతమాత ముద్దుబిడ్డలంటే..!
వీరు కదా ఖండాంతర కీర్తిని
ఆర్జించే సాహస వీరులంటే...వీరు కదా
మన త్రివర్ణపతాకాన్ని విశ్వ వేదికలపై రెపరెపలాడించే విశ్వవిజేతలంటే..!
వీరు కదా స్ఫూర్తి ప్రధాతలంటే…
భావి భారత నిర్మాతలంటే…
ఆర్చరీ క్రీడా కీర్తి కిరణాలంటే…
అమూల్యమైన మహిళా మణిరత్నాలంటే.!
కుక్క మనిషిని కరవడం కాదు న్యూస్
మనిషే కుక్కను కరవడమే వింతన్యూస్
అని షేక్స్పియర్ పలికినట్లు...
నేలపై నిల్చొని చేతులతో
విల్లు వంచడం సంధించడం కాదు..!
ఓ ఇనుప స్టాండ్ పై చేతులతో
తలక్రిందులుగా నిల్చొని...
ఎడమ కాలుతో విల్లును వంచి...
కుడికాలుతో మండే బాణాన్ని సంధించి...
టార్గెట్‌ను గురిచూచి కొట్టడమే...
విశ్వాన్నే విస్మయపరచే వింత న్యూస్..!
కృషిఉంటే మనుషులు ఋషులౌతారు...
మహా మహిళా మణిరత్నాలౌతారు...
విలువిద్యలో విశ్వవిజేతలౌతారు...
అన్నది సినీకవి "వేటూరి వేదాంతం"…
నిత్యం స్మరించాలి ఈ సందేశం...
మన క్రీడాకారులంతా జీవితాంతం...!
జయహో… జయహో…
ఓ క్రీడా కీర్తి కిరణమా...
ఓ ఆర్చరీ ఆణిముత్యమా...
అందుకో మా అభినందనలు...
అభిమానుల చల్లని ఆశీస్సులు…
చేరుకోవాలి మున్ముందు మీరు
విశ్వాన్ని అబ్బురపరిచే విజయశిఖరాలు.!


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి