బాలు సేవలు ప్రశంసనీయం-ఎ.పి.టి.ఎఫ్

 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మరియు అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా నియామకం సందర్భంగా ఉపాధ్యాయులు కయ్యూరు బాల సుబ్రమణ్యం స్థానిక ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కార్యాలయం లో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీ కృష్ణ మాట్లాడుతూ బాలు చేసిన ఉపాధ్యాయ సంఘం మరియు విద్యా సేవలను కొనియాడుతూ తమ సంఘానికే గర్వకారణమని అన్నారు.అనంతరంశాలువా,జ్ఞాపికతో సత్కరించారు.ఇటీవల పదవీ
విరమణ అయిన ఉపాధ్యాయులు ప్రభు ప్రసాద్ నుసంఘం తరపున సన్మానించారు .ఈ కార్యక్రమంలో సంఘ నాయకులుఎం రామదాసు,ఉదయ్ కుమార్,ముని రాజా,నాగసత్య, భాస్కర్, వెంకటాద్రి,గోపాల్,సుబ్రమణ్యం రెడ్డి,వెంకటయ్య, చెంచు రాజు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు