సాహితీ కెరటాలు
==============
వెలవెలబోతోంది నేడు కర్షకసొమ్రాజ్యం.
గతి తప్పి వలసబాట పడుతున్నది.
అతివృష్టి అనావృష్టి కుదేలు చేస్తున్నది.
అమ్మబోతే అడవి కోనబోతే కొరివిలా మారినది.
నల్ల చట్టాల నీడలో నలుగుతున్నది.
నకిలీ విత్తనాలతో నేలకూలుతున్నది.
గిట్టుబాటు ధరలులేక దిగాలుపడుతున్నది.
అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది.
తప్పులు చేయలేక తలలు బాదుకుంటున్నది.
సునామీలు సుడిగాలలుకు వణికిపోతున్నది.
ప్రచార మాధ్యమాల హోరుకు భీతిల్లుతున్నది.
ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురికాబడుతున్నది.
అన్నదాతకు నేడు కడుపునిండా తిండీ కరువవుతున్నది.
ఉచిత హామీలకు ఊరటలేకున్నది.
సంరక్షణలేక నీరసపడుతున్నది.
కూలీలు దొరకక పనులు చేయలేకున్నది.
యంత్రాల జోరుతో పనులు దొరకక అల్డాడిపోతున్పది.
కర్షక సామ్రాజ్యం కడగండ్లపాలవుతున్నది.
కన్నీరుపున్నీరుగా విలపించుచున్నది.

కర్షకుల పాట్లకు అననుకూల శీతోష్ణస్థితి యే కాకుండా సహజ వనరులు వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం సహాయం,తరచూ నియంత్రణా రాహిత్యం కారణం.బాగున్నదిరచన
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి