సాహితీ కెరటాలు
=============
జీవితమంటే ఎంత విలువైనదో తెలియదా?
ఉరుకులు పరుగులతో ఏమి సాధిస్తావు?
కాలం విలువ తెలియకుంటె ఎట్లా?
ఎందుకో నీకు అంత తొందర!
తొందరపడకు సుందరవదనా!
సంపదకోసం తాపత్రయ పడతావు.
పదవికోసం ప్రాకులాడతావు.
గమ్యం చేరడానికి లక్ష్యం ఉండాలిగా!
సహనం పాటించలేవు సమయం పాటించవు.
ప్రయాణం చేయాలంటావు అతివేగంతో దూకుతావు.
ఎదురుగా వచ్చినవారిని తొక్కెస్తావు?
నీ ప్రాణం మీద తీపి పెంచుకుంటావు.
సాటి వారిని మాత్రం పైకి పంపెస్తావు.
జీవితమంటే నీకు నిర్లక్ష్యం!
జీవనమంటె లక్ష్యం లేదు!
అత్యాశే నీకు ఆశయం.
శ్రమించడం నీకు కష్టం.
సులభంగా బ్రతకాలని ఉత్సాహం.
సోమరితనమే నీకిష్టం.
ఆవేశమే నీ గుణం.
ఎందుకో అంత తొందర!;- దోసపాటి వేంకట రామచంద్ర రావు - విజయనగరం
• T. VEDANTA SURY

భ్రమలో బ్రతుకు తెరువుఅపేక్షించేటి
దౌర్మనస్కుల లో కనువిప్పుకాగలదు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి