సామెత -53: అద్దమ్మ రాతిరి మద్దెల దరువు/ అంకమ్మ సిగాలు
****
"అవ్వా! నువ్వేమన్న జెప్పు.గీ కాలంల పొల్లగాండ్లు పుట్టి జెడ్డరో పుట్టక జెడ్డరో గని పురాగ జెడిండ్రు.వామ్మో! వామ్మో! ఏ పొల్లగాన్ని పొల్లని మందలిచ్చ వశం లేదు. శెవ్వా! గవేం పోకడలే అవ్వా!" నేనుండనని ఇంట్ల బడ్డ దనుక వొచ్చిన" బుగ్గలు నొక్కుకుంట అంటున్న జయమ్మొంక సంగతేందో తెల్వక సూడబట్టిండ్రు అమ్మలక్కలు.
"సంగతేందో చెప్పరాదె శెల్లె.ఏ పొల్లగాండ్లు ఏంది కత? అంటున్న అవ్వొంక జూస్కుంట పేద్ద నిట్టూర్పిడిసి... మా పెద్ద బాపమ్మ కొడ్కు పట్నంల డాటరుగ జేత్తుండు తెల్సుగద. మొన్నొక పెండ్లీల గల్సినపుడు ఎప్పుడూ ఇల్లూ ఆకిలి గొడ్డూ గోదా అన్కుంట గా వూరొదిరి రానే రావు. ఓ పద్దినాలు ఉండిపోదువు రమ్మని ఒక్క తీర్గ బతిలాడింది. మా ఆయన సుత గంతగనం పిలుత్తుంటే పోరాదే.పద్దినాలేగ నే జూస్కుంట తీ అండు. గట్ల బొయిన ఆళ్ళింటికి"...
"ఓష్నీ! ముచ్చట సల్లగుండ. పొయినవ్ సరెగని పొల్లగాండ్ల ఊసెందుకొచ్చిందే శెల్లె. అందరం నోరప్పలించుకుని ఏం జెప్తవాని సూత్తన్నం."
ఆగాగవ్వా! గాడికే వత్తన్న గా అన్న పొల్లగాండ్ల ముచ్చటనే. పొయ్యిన్నాడు పెండ్లి అడావిడి ఒల్లలిసి సోవి దెల్వకుండ పడ్కున్న. ఇంగ తెల్లారి అద్దమ రాతిరి ఒకటే డీజే సప్పుల్లు. ఇక ఇకలు పకపకలు.ఉల్కిపడి లేసిన. సుట్టుపక్కలోళ్ళింట్ల పెండ్లో పబోజనమో అన్కున్న. తీరా జూత్తె ఇంట్లెనే గా బంగులా పైన గదుల్నించి ఇనబడ్డయి. గీ మద్దెన దెయ్యాలేమన్న పోకడ మార్సుకొని గిట్ల సుత జేత్తున్నయా ఏంది? అనుకునే తల్కి వొళ్ళంత సల్లజెమట్లు బట్టినయ్. గజ్జున వొణుక్కుంట గుర్రుబెట్టి నిద్దుర బోతున్న వొదిన్ని లేపిన".
కండ్లు నుల్ముకుంట లేసిన వొదిన నా వాల్కం జూసి ఉల్కిపడి " వొదినా ఏమైంది. ఒళ్ళు బాలేదా? మీ అన్నని లేపనా? అంది. గొంతకాయ తడారి పోతుంటె ఏలు లేపి పైకి జూపిన.అర్దం గాలె. గా గా సప్పుల్లేందన్న" గంతె మా వొదిన ఒక్క తీర్గ నవ్వుకుంట...
"నీ అల్లుడు, కోడలు వాళ్ళ దోత్తులతో ఏదో ఆటో పాటో పాక్టీసు జేత్తుండ్రొదినా! గదే సప్పుడు" అన్కుంట 'గలాసెడు నీళ్ళిచ్చి,గివి దాగి పడ్కో వొదిన' ఆవులిచ్చుకుంట పొయ్యి పడ్కుంది."
"ఇంగ నాకు రాతిరంత రాంబజనే అన్కో. కంటి మీద రెప్ప బల్లే" అంటున్న జెయమ్మొంక జూస్కుంట...
అర్గు మీద కూసున్న అమ్మలక్కలు కిస్స కిస్స నవ్వుతుంటే.. "ఎహే ఆగండే తల్లీ! పాపం మన జెయమ్మ "అద్దమ రాతిరి మద్దెల దరువొతికె గా సప్పుళ్ళూ, అంకమ్మ సిగాలొతికె గా దడదడ మాటలిని ఎంత అదురుకుందో సెప్పింది గద! ఇంక నయ్యం బయ్యానికి గుండె నొప్పి లెవ్వలే" అంటుంటె...
నిజ్జంగ అవ్వా! ఇంగ పొద్దుగాల గా పొల్లగాండ్లు ఏస్కున్న దిరసులు,అద్దమ రాతిరి గా సిగాలు, దరువులు జూత్తుంటె "యాక్ థూ! అన్పించింది.మనూల్లెకి అడుక్కోనీకి వచ్చే బిచ్చపోళ్ళు నయమన్కో. సిరుగుల్ల వొళ్ళు గన్పించకుండ దాస్కుంటరు.గవన్నీ సూల్లేక వోరానికే ఇంట్లబడ్డదాంక వొచ్చిన "
"అవునవును.గిప్పటి పోరలు గట్లనే జేత్తుండ్రు.అమ్మ అయ్య జెప్తె ఇంటల్లే"... అన్కుంట గవే ముచ్చట్ల బడిపోయిండ్రు అక్కడున్న అమ్మలక్కలంత.
గిదే ఎన్కటైతే ఒకాయన మద్దెల కొన్నడంట. పొద్దూకులు పన్లతో నేర్సుకోవడం కుదర్క అద్దమ రాతిరి మొదలు బెట్టిండంట. గాయన సుట్టు పక్కలున్నోళ్ళు యిసుక్కుంట అద్దమ రాతిరి మద్దెల దరువు ఏందిరా అయ్యా! గిట్ల జేస్నవంటే నీ ఈపు మీద మేమంద్రం దరువేత్తం అన్నరంట" గా మాటలిని నవ్వుకుంట మరి"అంకాలమ్మ సిగాలు" అన్నరు.
"గది సుత గిట్లనే అన్కో రాదురి. యోగాసనాలు,పానాయామం నేర్సుకుంటున్న ఒకామె ఉబ్బాగక అద్దమ రాతిరి లేసి బుస్సు బుస్సని మొదలుబెడితే మొగుడు దడ్సుకొని గా మాట అన్నడంట" గట్లనే ఉంది మన జెయమ్మ జెప్పింది" అంటుంటే..అవుమల్ల అన్కుంట నవ్వబట్టిండ్రు.
గదండీ సంగతి! అద్దమ రాతిరి మద్దెల దరువు,అద్దమ రాతిరి అంకమ్మ సిగాలు అంటే...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి