సాహితీ కెరటాలుసాహితీ కవి కళా పీఠం================తొందరపడకు సుందరవదనా!విత్తు నాటకముందే మొలకకు,మొలకలు ఎదగకమునుపే,పంట దిగుబడి ఊహలకు!తొందరపడకు సుందరవదనా!ప్రయత్నం చేయకనే ఫలితమునకు,సాధన చేయకనే కళలలోప్రావీణ్యము పొందగోరుటకు!తొందరపడకు సుందరవదనా!అడుగులు వేయకనే నడకకు,నడక నేర్వకనే పరుగులకు,పరుగు తీయకనే పోటీలకు!తొందరపడకు సుందరవదనా!చదువకనే పరీక్షలందుఉత్తీర్ణత కోరుటకు,ఉన్నతస్థానము ఆశించుటకు!తొందరపడకు సుందరవదనా!నిదానమే ప్రధానం,అభ్యాసమే కూసు విద్య.నీ కష్టార్జితమే నీకు దక్కే ఫలితం.
నిదానమే ప్రధానం:- బి.ఉషారాణి-మంచిర్యాల
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి