సుప్రభాత కవిత : -బృంద
నింగిలో ఈ ఎరుపు రాక
ఎన్ని కన్నుల్లో మెరుపులో 
ఎన్ని కథలకు కొసమెరుపులో 
ఎన్ని కలల  మైమరపులో...

స్వప్నించే మనసుకు 
సత్యమిదే యన్న 
మేలుకొలుపు.....

వర్షించే కన్నులను
వరించే మరుపుకు
దగ్గర చేసే మరో మలుపు

శ్రమించే మనసుకు
గమ్యం దగ్గర చేస్తూ
దూరం చేరిపేసే మరో పిలుపు

పుష్పించే  కుసుమాలను
ప్రేమగా తాకే తొలివెలుగుల
స్పర్శించే  పలకరింపు..

పరమేశ్వరుని రాకను
ప్రపంచానికి తెలియచేయ
ఎరుపెక్కిన తూరుపు

మగత నిదురలో ఉన్న
జగతిని  నిద్రలేప
నీమము తప్పక వచ్చే వేలుపుతెచ్చే

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు