ప్రతిభకు ఏది అవరోధం కాదని
గొడ్ల కాపరిగా పనిచేసినా
భవన నిర్మాణ కార్మికునిగా పనిచేసినా
ప్రజాహితమే ధ్యేయంగా పాటలే ఊపిరిగా
శృంగేరి పీఠానికి చెందిన శంకర మహరాజ్ ఆశీస్సులతో
సినీ నిర్మాత నారాయణమూర్తి
సినిమాలకు
విప్లవగీతాలనందించి
ప్రజాకవిగా పేరు పొందిన అందెశ్రీ
'మాయమై పోతున్నడమ్మ మనిషిడన్నవాడని'
'పల్లె నీకు వందనములమ్మా' యని
'యెల్లి పోతున్నావ తల్లి' యని
తెలంగాణ మలి దశ ఉద్యమంలో
"జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం " అన్న గేయం ద్వారా ప్రేరణ చెందించిన అందెశ్రీ
మీరు గౌరవ డాక్టరేట్, దాశరథి, డాక్టర్ రావూరి భరద్వాజ
సుద్దాల జానకమ్మ హనుమంతు జాతీయ పురస్కారాలకే వన్నెతెచ్చారు.
ఎర్ర సముద్రం సినిమాకోసం
మీరు రచించిన 'మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు'
విశ్వవిద్యాలయాల్లో పాఠ్య0శం గా ప్రవేశపెట్టడం మీ కిచ్చిన గౌరవం.
తెలంగాణ ప్రభుత్వం మీ గేయం
'జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం' ను
రాష్ట్రీయ గీతంగా ప్రకటించి
కోటి నగదుపురస్కారం మీకిచ్చిన అత్యున్నత గౌరవం.
ఎప్పుడు కలసిన అప్యాయంగ పలకరించే
అందెశ్రీ అందనిలోకాలకు వెళ్ళడం చూసి
ఆర్ద్రతతో నేనర్పిస్తున్న అక్షర నివాళి......!!
............................
ప్రజాకవి అందెశ్రీ కి నివాళి:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి