పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నేడు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేటలో స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము.మా పదవ,తొమ్మిదవ తరగతుల విద్యార్థులమే ఉపాధ్యాయులుగా వ్యవహరించి,6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అన్ని విషయాలు మా ఉపాధ్యాయుల సహకారంతో బోధించాము.
ఉదయం ప్రార్థన సమావేశంలో ప్రతి రోజు మా ఉపాధ్యాయులు ఏవిధంగా నిర్వహిస్తారో అదేవిధంగా నిర్వహించాము.మాకు ఒక్క రోజుమందము టైం టేబుల్ ఏర్పాటు చేశారు మా ఉపాధ్యాయులు .మొదటి పిరియడ్ కాగానే తరగతుల వారిగా వెళ్ళి హాజరు తీసుకొని, విషయాలను బోధించాము.అలాగే చివరి పిరియడ్ వరకు అన్ని విషయాలు చాలా చక్కగా పిల్లలతో కలిసిపోయి బోధించాము.మద్యలో డి.యి.ఓ గారు కూడా వచ్చి,అచ్చం ప్రభుత్వ జిల్లా విద్యాధికారి లాగే వ్యవహరించారు.ఆవిధంగా మధ్యాహ్నం వరకు అన్ని తరగతులకు బోధించి,అన్నం తిన్నాము.
మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేసుకొని, మేమే వాఖ్యాతలుగా ఉపాధ్యాయులతో పాటు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన మేమేంతా వేదిక మీద కూర్చొని, ముందుగా అమ్మవారు సరస్వతి దేవికి దీపారాధన చేసి, పూలమాల వేశాము.నెహ్రూగారి చిత్రపటానికి కూడ పూలమాలలు వేసి.నేహ్రుగారి గొప్పతనం గురించి,పిల్లలంటే తనకు ఎందుకు ఇష్టమో మా ఉపాధ్యాయులు చక్కగా వివరించారు. అలాగే పిల్లలు కవితలు, ఉపన్యాసాలు చెప్పారు.తర్వాత ఉపాధ్యాయులుగా వ్యవహరించిన వారందరం తమతమ అనుభవాలను వేదిక పైన మాట్లాడుకున్నాము.పాఠం చెప్పడం ఎంతకష్టమో మా ఉపాధ్యాయులు రోజు ఎంతో కష్టపడుతారని అనుకున్నాము.వేదిక పైన అందరం సంతోషంగా మాట్లాడాము.అదే విధంగా మా ఉపాధ్యాయులు మమ్మల్నందరిని చాలా మెచ్చుకున్నారు.ఈ విధంగా బాలల దినోత్సవాన్ని మా పాఠశాలలో చాలా ఆనందంగా జరుపుకున్నాము.
----------------------------------------------------------
యం.ప్రణవి,యం.హర్షిత,టి.నందిని.
10వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట
మం/ గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి