మానవత్వం ఎక్కడ ?? : కోరాడ నరసింహా రావు!
కన్నతల్లి మమకారమే... 
   బిడ్డ కిచ్చుపాలలోని మాధుర్యం...! 

చంటి బిడ్డ ఎదుగు దలలో
  తల్లి ప్రేమే ఔ ష ధం...! 

నవ మాసాలూ మోసి.... 
  జన్మనిచ్చు కన్నతల్లి కన్న దైవ మెవరు ఈ లోకంలో? 
 మాతృదేవోభవ.💐🙏🌷

మన జన్మకు మూలము కన్న తండ్రి వీర్యము 
 తన వెలును అందించి
 మన చేయి పట్టి నడిపిం చి... 
బాధ్యతగా పెంచు తండ్రి సాక్షాత్తు ఆ దైవమే! 
 పితృ దేవో భవ💐🙏🌷

నిస్వార్ధముగా బిడ్డల బాగు కొరకు 
   తపించే తలి దండ్రులు
  వారి శక్తినంత దారపోసి
 మనల ప్రయోజకుల జేసి
   తనువువడలి వృద్దులైతే

రెక్క లొచ్చిన పక్షుల వలె 
 గూడు వీడి మీరు పోతే
 మానవత్వ మెక్కడు0ది
 మనిషి జన్మ కర్ధమేది !? 
      *****


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Super