శ్లో కం:
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ ।
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ॥ 1 ॥
భావం: ఓ దయామయుడా! పశుపతీ, నా హృదయంతో నేను కల్పించిన ఈ పూజను స్వీకరించు. రత్నాలతో చేయబడిన సింహాసనం, హిమజలాలతో స్నానం, రత్నాలతో అలంకరించబడిన దివ్యమైన వస్త్రాలు, కస్తూరితో కూడిన చందనం, మల్లెలు, సంపెంగలు, బిల్వపత్రాలతో కూడిన పుష్పాలు, ధూపం, దీపం... ఇవన్నీ నీకోసం సిద్ధం చేశాను.
రత్నైః కల్పితమాసనం: రత్నాలతో అలంకరించిన ఆసనం (సింహాసనం).
హిమజలైః స్నానం చ దివ్యాంబరం: చల్లని నీటితో స్నానం చేయించి, మణిమయాలతో అలంకరించిన దివ్యమైన వస్త్రాలను ధరింపజేయడం.
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్: అనేక రత్నాలతో అలంకరించబడినది, కస్తూరితో సువాసన వెదజల్లే చందనం.
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం: మల్లెలు, సంపెంగలు, బిల్వపత్రాలతో కూడిన పుష్పాలు, ధూపం, దీపం.
దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్: ఓ దయానిధే! ఓ పశుపతీ! హృదయంతో (మనసుతో) కల్పించిన ఈ పూజను స్వీకరించు.
******
శంకరాచార్య విరచిత - శివమానస పూజ స్త్రోత్రం :- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి