ఉనికి ఎరుగని తావుకు
ఉరికి చేరుకునే వెలుగు
ఊపిరి పోసి పెంచే
ఊహకు అందని చెలిమి!
మోడుగా నిలిచిన క్షణంలో
తోడెరుగని ఒంటరి నావకు
రేవుకు చేర్చే బాధ్యతతో
చేయందించే చెలిమి!
దిక్కు తోచని దోవలో
మిక్కిలి వేదన భారంలో
ఉక్కిరి బిక్కిరి అయిన మనసుకు
చక్కని మార్గం చూపే చెలిమి!
నేలకు చెందక దూరమై
నింగిని అందుకోక నీరసించి
కుంగిన మదిని పొంగించాలని
చేయందించే చెలిమి!
నీదంటూ ఒకరోజు
నీకంటూ ఒక విజయం
రాక తప్పదని ఊరడించే
కమ్మని నమ్మకమిచ్చే చెలిమి!
నీ సంగతులన్నీ తెలిసి
నీ కోసం రేపును తెచ్చి
నీ వెంటే ఉంటానంటూ
కొత్త ఆశలు కలిగించే మిత్రునికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి