శాస్త్రవేత్త సరళత:- - యామిజాల జగదీశ్
 చాలా మందికి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను "సాపేక్ష సిద్ధాంత" పితామహుడిగా తెలుసు...
కానీ ఆయన దైనందిన జీవనశైలి ఎంత సరళంగా, ప్రశాంతంగా ఉండేదో  కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ఐన్‌స్టీన్ ఓ సూపర్‌స్టార్ శాస్త్రవేత్తలా జీవించలేదు. నిశ్శబ్ద క్షణాలు, ఉత్సుకత, సౌకర్యాన్ని అన్నింటి కంటే విలువైనదిగా భావించే వ్యక్తిలా జీవించారు.
ఆయన జీవితాన్ని  ప్రత్యేకంగా ప్రేరేపించేవివే...
* ఆయన ప్రతిరోజూ నడిచేవారు. ఇలా అనగానే ఇందులో ఏముందీ, అందరూ నడిచేదేగా అనుకోవచ్చు. కానీ ఐన్‌స్టీన్ ప్రతిరోజూ సుదీర్ఘ నడకలు చేసేవారు. నెమ్మదిగా నడిచేవారు. అంతేతప్ప ఏదో కొంపలంటుకున్నట్లు నడిచేవారు కాదు. స్పష్టంగా ఆలోచించడానికి, కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి ఈ నడకలు  సహాయపడతాయని ఆయన నమ్మారు.
ఆయన సరళతకు విలువ ఇచ్చారు దుస్తులను ఎంచుకోవడంలో విలువైన సమయాన్ని వృధా చేయకూడదని ఆయన తరచుగా ఒకే రకమైన దుస్తులను ధరించేవారు.
ఆయనకు సంగీతమంటే ఇష్టం. 
ఐన్‌స్టీన్ ఒత్తిడి అనిపిస్తే దాని నుంచి బయటపడటానికి వయోలిన్ వాయించేవారు. సంగీతం కేవలం ఒక అభిరుచి కాదు, దాని ద్వారా ఆయన తనను తాను చైతన్య పరచుకునే వారు.  
* ఆయనలోని మరొక రహస్యం తెలివితేటలు కాదు,  చిన్నపిల్లవాడిలా ప్రశ్నలు అడగడం.
జ్ఞానం కంటే ఉత్సుకత ముఖ్యమని ఆయన నమ్మారు.
 • ఆయన చిన్న చిన్న విషయాలనూ ఆస్వాదించారు. వాటిలో ఒక కప్పు టీ, సరస్సు దగ్గర నడక, నిశ్శబ్ద సాయంత్రం, తన ఆలోచనలతో ఏకాంత సమయం, సైకిల్ తొక్కడం. రణగొణధ్వనులతో హడావిడిగా కూడిన ఈ ప్రపంచానికి ఐన్‌స్టీన్ ఓ గొప్ప శక్తివంతమైనదాన్ని గుర్తు చేస్తుంటారు...
ప్రశాంతమైన మనస్సుతో అనుకున్నది హాయిగా చేసుకుపోవచ్చునని.


కామెంట్‌లు