నేటి మొలకలు-రేపటి పసిడి పంటలు
నేటి మొక్కలు రేపటి పూల తోటలు
నేటి మొక్కలు రేపటి పళ్ళ తోటలు
నేటి మొక్కలు రేపటికాయ కూరలు!!
నేటి మొక్కలు రేపటి వృక్షాలు
నీటి వృక్షాలు రేపటి వనాలు
నేటి వనాలు రేపటి మహారణ్యాలు
వాళ్లే బాలలు!!!!!!!!!.
నేటి చినుకు రేపటి వాన
నేటి వాన రేపటి వాగు
నేటి వాగు రేపటి చెరువు
నేటి చెరువు రేపటి నది
నేటి నది రేపటి జలపాతం
నేటి జలపాతం రేపటి మహానది
నేటి మహానది రేపటి మహాసముద్రం
వాళ్లే బాలలు!!!!!!!!!!!.
నేటి చీకటి రేపటి ఉదయం
ఆ ఉదయమే బాల్యం
నేటి బాల్యం రేపటి సూర్యుడు!!
నేటి చీకటి రేపటి వెన్నెల
ఆ వెన్నెలే బాల్యం
నేటి బాల్యం రేపటి చంద్రుడు!!!
నేటి ఆకాశం చిమ్మ చీకటి
రేపటి కోట్ల నక్షత్రాలు ఎన్నో వెలుగులు
వాళ్లే బాలలు!!!!!!!!!!.
నేటి బడి రేపటి విశ్వవిద్యాలయం
నేటి బడి రేపటి న్యాయస్థానం
నేటి బడి రేపటి వైద్యశాల
నేటి బడి రేపటి రాజ్యం
నేటి బాలలు రేపటి ప్రపంచం!!!!!.
నవంబర్ 14 బాలల దినోత్సవం పురస్కరించుకుని శుభాకాంక్షలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి