సామెత -40 - అంతా అయినోళ్ళేగని షారెడు మంచి మంచినీళ్ళు పుట్టయి
*****
"ఏం మడుసులో ఏమో? గా ముసల్దాన్ని అరిగోస పెడుతున్నరు. గొంతెడ్కబోతుందన్నా సైమానికి షారెడు మంచిల్లు ఇచ్చెటోళ్ళు లేరు.ఎంతైనగని ముసల్తనం దాంక బతకొద్దవ్వా?మల్ల పరాయోళ్ళు ఎవులన్న ఉండ్రా అంటే లేరు.అంతా అయినోళ్ళే. పాపం గా జేజవ్వని తల్సుకుంటె జాలు మన్సంత ఎట్లెట్లనో అయితంది."
పొద్దుగూకయిందని దీపాలు దిగూట్ల బెడ్తున్న అవ్వ తానకి వొచ్చి గీ మాటల్ని జెప్పింది భద్రమ్మ.
"అవునే భద్రా!,"తలంత బల్గం ఉంది గని తలకు బోసే దిక్కు లేదు"అన్నట్టుంది.ఇంటి సుట్టూత అయినోళ్ళె .పతొక్కలు అవసరానికి ఆయమ్మ దగ్గర సాయం బొందినోళ్ళె. గిప్పుడు ఒక్కలంటె ఒక్కలు సుత ఆమె తానకి బోట్లే.ముట్టుకుంటే అంటుకుంటది. మాకేం గరుజు పట్టిందన్నట్లున్నరు. "సముద్రం తలాపునుండి శేప దూపకేడ్చినట్టుంది"."కలికాలమే తల్లీ! కనికరం లేని కాలం".
ఇంగ మనసుమంటోళ్ళం గిన్ని చాయ్ నీళ్ళో,అట్టో రొట్టో చేసిందాంట్లెనించి గింత దీసికెల్లి పెడ్తమంటె గట్ల సుత బెట్టనీయట్లె. 'గంత సాన్భూతి ఎవలనుంచి ఏమక్కల్లే. మేమున్నం గద అని ఒక్కలంటే ఒక్కల్ని ఇంటి కడప తొక్కనీయట్లేదు. ఏం జేయాల్నో సమజైతలేదె భద్రా!
అవునవ్వా!"గిసొంటి పాపిట్టోళ్ల వల్లనె లోకం జెడిపోతుంది."
అందుకేనే భద్రా! "అంతా అయినోళ్ళేగని షారెడు మంచి మంచినీళ్ళు పుట్టయి" అన్న సామెత ఊకె అన్లే మన పెద్దోళ్ళు. ఎట్టాగైన రేప్పొద్దుగాల సూడనీకి ఎల్దాం"అంది అవ్వ.
గా మాటల్ని అక్కడ్నే కూసుని సదుకుంటున్న భూలచ్మి బుడ్డోడు యిని "అవ్వా! అవ్వా! గా జేజవ్వ తానకెల్లి మా మంచిల్ల సీస యియ్యమా? అంటుంటే అవ్వ, భద్రమ్మ చెరొకల్ని దగ్గరికి దీస్కుని "మా బంగారాలు ఎప్పుడూ గిట్లనే పేమ గుణంతో ఉండాలె"అన్కుంట ముద్దు బెట్టిండ్రు.
గదండీ సంగతి! ఎనకట ఎవలో చెప్పినట్టు "అంతా అయినోళ్లే గని షారెడు మంచి మంచినీళ్ళు పుట్టయి" అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి