అందంగా మలచాలిగా:- బి.ఉషారాణి-మంచిర్యాల
సాహితీ కెరటాలు
సాహితీ కవి కళా పీఠం
=================
జీవితమనే పుస్తకమున,
ఊహించని మలుపులతో సాగే
బ్రతుకు కథలో, ఆఖరి పేజీ ఇచ్చే
ముగింపు సుఖాంతమో, దుఃఖాంతమో,
తెలియదుగా ముందే ఎవరికీ!

అది విధి లిఖితమని భావించి,
అనుసరిస్తూ పోవుట కన్నా,
చెమట చుక్కలు చిందించి
నుదుటి రాత మార్చగా,
నిర్విరామ కృషి చేసి,
అందంగా మలచాలిగా!

ఎప్పుడే పుట తిరగేసినా,
మధుర పరిమళమే తాకేలా,
నడవాలి మనం ప్రతిక్షణం,
మలచుకోవాలి అందంగా జీవనం.

ఉన్నదానితో తృప్తినొంది,
లేనిదానికై నిజాయితీతో కష్టపడి,
మూడునాళ్ళ ఈ బ్రతుకును
ముచ్చటగా తీర్చుకోక;
ముళ్ళకంపలా మార్చుటేల, మహిలో?


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
👌