పుస్తులు అరువు పెట్టి :- -గుండు మల్లికార్జున రావు -బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు (జిల్లా),.

 సాహితీ కళాపీఠం.    
=============
కర్షక సామ్రాజ్యమా.!---- జరిగే పనేనా అది.!
ఒక సామ్రాజ్యాన్ని నిర్మించే కర్షకులే ఈ దేశంలో ఉంటే 
ఆత్మహత్యలు ఎందుకు ఉంటాయి.?
కడుపునిండా కూడు లేని రైతులు ఈ దేశంలో ఎందుకు ఉంటారు?  ఆకలి చావులు ఎందుకుంటాయి.?
రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటకు 
మద్దతు ధర నిర్ణయించేది ధళారీల  ప్రభుత్వం.!
నోరు విప్పి మాట్లాడలేని చాదస్తపు రైతులు. 
తరాలు తరబడి భూమిని నమ్ముకుని 
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ 
నష్టం వచ్చినా చెప్పుకునే దిక్కు లేక..
ప్రకృతినే వేడుకొంటూ పుస్తులు అరువు పెట్టి,
బ్యాంకుల చుట్టూ తిరుగుతూ..
దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యెలే శరణ్యం..
నేటి తరం యువత పాతకాలం పాతకాలం అంటారు..
20వ శతాబ్దం వచ్చినా..
రైతుల ఆత్మహత్యలు పాతకాలంలోనే ఉన్నాయి..
ఆదుకోను ఇంకా ఏ భగవంతుడు పుట్టలా.!
ప్రపంచమంతా పూజించాల్సిన రైతు పాదాలన్ని--
రైతంటేనే ఈసడీంచుకునే సిగ్గుమాలిన సమాజం మనది.
కామెంట్‌లు