రంగ, వాసు ఇద్దరూ ఒకే తరగతి చదువుతున్నారు. ఇద్దరూ చదువులో తెలివైన వాళ్ళే. కానీ ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి బీభత్సమైన ఈర్ష్య, అసూయ. ఒకరితో మరొకరు అస్సలు మాట్లాడుకోరు. ఉపాధ్యాయులు వీళ్ళిద్దరినీ కలపడానికి సహస్ర విధాలా ప్రయత్నించారు. కానీ లాభం లేదు.
ఒకరోజు ఉన్నట్లుండి రంగ తన పుట్టినరోజు వేడుకలకు అందరినీ ఆహ్వానించాడు. "మన మధ్య ఉన్న విభేదాలకు శాశ్వతంగా స్వస్తి చెప్పి, ఇక నుంచి కలసిమెలసి ఉంటాం." అని రంగ వాసుతో అన్నాడు. తన పుట్టిన రోజు వేడుకలకు వాసు తప్పనిసరిగా రావాలని, రాకుంటే తాను పుట్టిన రోజు జరుపుకోనని వాసు అన్నాడు. వాసు ఒప్పుకున్నాడు. రంగ పుట్టినరోజునాడు అందరూ కలుసుకున్నారు. రంగ పిజ్జా, బర్గర్లు, సమోసాలు, కూల్ డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చాడు. కాసేపట్లో అవన్నీ వచ్చాయి. అందరూ లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. వాసు వాటి వైపు చూడటం లేదు. వాసు ప్రాణ స్నేహితుడు రాము వాసుతో "వాసూ! అందరం తింటుంటే నువ్వు ఏమీ తినడం లేదు. వాటివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు." అన్నాడు. "మీకు తెలియదా? నేను బయట తయారు చేసే అనారోగ్య కారకాలైన ఆహార పదార్థాలను తినను అని. రంగకు కూడా తెలుసు నేనువాటిని తిననని. వాటి వల్ల మన ఆరోగ్యం బాగా దెబ్బ తింటుంది తప్ప ఏమీ లాభం లేదు." అన్నాడు వాసు. రాము చాలా బాధ పడ్డాడు.
కొన్నాళ్లు గడిచాయి. వాసు పుట్టిన రోజు వస్తుంది. వాసు తన పుట్టినరోజు వేడుకలకు అందరినీ పిలిచాడు. రకరకాల పండ్ల రసాలతో పార్టీ ఇచ్చాడు. ఎవరికి కావలసినంత వారు ఆ పళ్ళ రసాలను తాగవచ్చు. కూల్ డ్రింక్సుకు బాగా అలవాటు పడ్డ రంగకు ఈ పండ్ల రసాల పార్టీ బాగా నిరుత్సాహపరచింది. వాటిని ముట్టుకోలేదు. రాము మనసులో బాగా సంతోషించాడు. మరునాడు రాము జరిగిన ఆ రెండు పుట్టినరోజు పార్టీల గురించి ప్రియమైన ఉపాధ్యాయుడు పాండురంగ మాస్టరుకు చెప్పాడు. "నాకైతే కొంగ నక్క పాయసం కథ గుర్తుకు వచ్చింది గురువుగారూ!" అన్నాడు రాము.
మరునాడు పాండురంగం గారు తరగతిలో కూల్ డ్రింక్స్, బయట దొరికే సమోసాలు, పిజ్జాలు, బర్గర్ల వల్ల మన ఆరోగ్యం ఎంత దారుణంగా దెబ్బ తింటుందో సవివరంగా తెలిపారు. అది వింటున్న రంగకు భయం వేసింది. మంచి ఆరోగ్యానికి వివిధ రకాల పండ్లు ఎలా దోహదం చేస్తాయో మరింత సవివరంగా తెలిపారు ఉపాధ్యాయులు. రంగకు కనువిప్పు కలిగింది. తాను వాసును అవమానించాలని చూసినా వాసు తనకు మేలు చేయబబోయాడు. వాసును క్షమించమని వేడుకున్నాడు రంగ.
పార్టీ : - సరికొండ శ్రీనివాసరాజు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి