గుట్టు...మెట్టు...చెట్టు...? ;- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
ఆగుట్టొక్కటి
తెలుసుకుంటే..?
మీరు మెల్లమెల్లగా 
మెట్టు మెట్టు ఎక్కవచ్చు... 
ఎవరెస్టు శిఖరాన్ని 
అధిరోహించవచ్చు...
పచ్చని చెట్టులా ఎదగవచ్చు
పదిమందికి ఫలాలు పంచవచ్చు...

కలవని నింగీ నేలగా 
కలవని రైలుపట్టాలుగా
అందరికీ ఆమడదూరంగా
బద్దశత్రువుల్లా బ్రతికేకన్నా...
 
కలుపుగోలుతనంతో...
చిరునవ్వు ముఖాలతో... 

అభిమానంతో...గౌరవంతో... 
ఆత్మీయమైన...ఆలింగనాలతో... 

ప్రేమపూర్వకపు...పలకరింపులతో...
హృదయపూర్వక...అభినందనలతో... 

పువ్వుతావిలా...
పాలలో నీళ్ళలా...
చిలకా గోరింకల్లా... 
పువ్వుల హారంలో దారంలా...
చిలికిన పెరుగులో నెయ్యిలా... 

పగా ప్రతీకారాలు...  
కుళ్ళు కుతంత్రాలు... 
అసూయా ద్వేషాలు...అహంకారం...
ఆవగింజంతైనా...మదిలో లేకుంటే...
అరిషడ్వర్గాలను నియంత్రించుకుంటే...

సహనం...
సమానత్వం... 
మంచితనం...
మానవత్వం...
ప్రేమతత్వం...
సౌభ్రాతృత్వం...
దాతృత్వం...దైవత్వం...
అనే సత్వగుణ 
సద్గుణాలే మనిషికి 
తరగని సిరిసంపదలన్న...
ప్రశాంతమైన జీవనానికి 
సుఖశాంతులకు సోపానాలన్న... 
చిన్నగుట్టు...తెలుసుకుంటే చాలు...

గౌరవ మర్యాదలకు... 
పేరుప్రతిష్టలకు...కీర్తి కిరీటాలకు...
కొరత వుండదు కొంచెమైనా... 
రాణించవచ్చు మనిషి... 
రాజులా రారాజులా ఏరంగంలోనైనా...


కామెంట్‌లు