అల్లన మెల్లన అలలన్ని
కిరణము సోకి తెల్లనై
ముత్యపు మాల తెగి పడ్డట్టు
చెల్లా చెదురై సయ్యాటలాడె!
ఒద్దికగా నిలుచుని చూసే
ఒడ్డున పెరిగిన గడ్డిపువ్వు
వయ్యారంగా వంగి చూసి
అందుకోవాలని ఉయ్యాలూగె
తళ తళ మెరుపులతో
గలగల నవ్వుతూ
చక చకా సాగిపోయే
ఏటినీటికి అంతా అతిశయమే!
పాలమబ్బుల నీడలో
తేలిసాగే పవనుడు
పూలతీవెల పలకరించి
తేట నీట తానమాడే!
వెండి వెలుగుల జిలుగులతో
కొండను వెలిగించి రవి
అండగా అవనికి ఉండమని
అచలాలను అనునయించె!
భువనపు అందాలు
వేయింతాలు చేయ
దివినుండి దైవము
దిగివచ్చు దినదినమే!
వేలుపుకు వందనమంటూ
🌸🌸సుప్రభాతం 🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి