జీవితమంతా మధుహాసం :- ఓగిరాల గాయత్రి విజయవాడ
సాహితీ కవి కళాపీఠం, 
సాహితీ కెరటాలు,
================
భావి భాగ్యోదయానికి వెలుగునిచ్చే ఉజ్జ్వల ప్రభాతకిరణం, 
ఆది నుంచీ ప్రోది చేసుకునే ఆత్మవిశ్వాసం!

ఆత్మవిశ్వాసం అణువణువునా నింపుకున్న జీవితంలో, 
ఎప్పుడూ కురుస్తాయి, పున్నమి వెన్నెల జల్లులే!

విశ్వాస రాహిత్యంతో సదా సంచరిస్తే విధిగా,
అమావాస నిశీధే నిధిగా మారి చేస్తుంది వ్యధా భరితం!

ఆత్మవిశ్వాసమే ఆభరణంగా, అమరగుణంగా,
జీవితాన్ని నెరపినవాళ్ల  చరిత్ర పుటల్లో సువర్ణాక్షర లిఖితం!

స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ అవసరమైన దివ్యౌషధం తన మీద తనకున్న నమ్మకం!

ఝాన్సీ లక్ష్మీభాయి, రుద్రమదేవి  ధీరవనితలు, తమ ధైర్యస్థైర్యాలతో తరువాతి తరంవారికి మార్గదర్శనం చేశారు, పథ నిర్దేశకులుగా!
 
ఝాన్సీలక్ష్మి తన అసహాయ శూరత్వంతో, ఆంగ్లేయులను ఎదిరించిన విధం,
అత్యంత సంభ్రమం, చరిత్ర మిగిల్చిన చతురతలా కలిగిస్తుంది,అమితమైన విభ్రాంతిని!

ఆత్మవిశ్వాసం నిలువునా నింపుకున్న జీవికి లేదు ఎందునా క్షయం! 
సర్వకాల సర్వావస్థల్లో అతని జీవిక అమృతప్రాయమైన అక్షయం!

ఆత్మవిశ్వాసం మన హృదయపు అధరంపై విరిసే, 
మనోహరమైన దరహాసం! 

ఆత్మవిశ్వాసమే శ్వాసగా ముందుకు సాగితే,
జీవితమంతా మధుమాసం!

కామెంట్‌లు