ఓ మనిషీ...గుర్తుంచుకో..!
నీకు జన్మనిచ్చేది ఇద్దరు…
అవనిలో అమ్మ...
ఆకాశంలో బ్రహ్మ...!
నీకు జీవనపాఠాలు నేర్పేది ఇద్దరు…
నీవు చేసిన తప్పులు...
నీకు తగిలిన ఎదురు దెబ్బలు..!
నీకు జ్ఞానం అందించేది ఇద్దరు…
నీవు కలిసిన మహానుభావులు...
నీవు పఠించిన బృహత్ గ్రంథాలు..!
నీకు ప్రశాంతతను ప్రసాదించేవి రెండు…
దైవ సన్నిధిలో నీవు చేసిన
భక్తి పూజలు...నీ కన్నీటితో ప్రార్థనలు...!
నీకు శాంతిని వెదజల్లేవి రెండు…
నీవు దర్శించిన గుళ్ళు గోపురాలు...
పుష్కరాలు...పుణ్య తీర్థాలు...!
నీకు ఆనందాన్ని పంచేవి రెండు…
నీవు చేసిన విహార యాత్రలు...
నీవు చూసిన ప్రకృతిరమణీయ దృశ్యాలు.
నీకు గౌరవాన్ని తెచ్చేవి రెండే…
నీ నిర్మల నిష్కల్మష హృదయం...
నీ నిస్వార్థ ఆపన్న అమృతహస్తం...!
ఓ మనిషీ...గుర్తుంచుకో..!
ఆపదలో ఉన్నవారిని ఆదరించడం....
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం...
నీడలేని నిరుపేదలకు నీడ నివ్వడం...
నరుడే నారాయణుడని భావించడం...
నీలో ప్రకాశించే దైవిక సద్గుణాలు..!
ఓ మనిషీ...మరిచిపోకు..!
నీ సహనం...
ఒక చల్లని వర్షం...
నీ సమయస్ఫూర్తి...
ఒక సుమభరిత సుగంధం
నీ సమానత్వం...
ఒక సప్తరాగాల సంగీతం
నీ మంచితనం...
ఒక మలయమారుతం...!
నీ మానవత్వం...
ఒక మణిమయ మకుటం...
నీ ప్రేమతత్వం...ఒక దైవదరహాసం
నీ సౌభ్రాతృత్వం...సత్సంకల్పం...
నీ సమబుద్ది...నీ చిత్తశుద్ధి...
నీలో వెలిగే నవ జీవన జ్యోతులు...!
సద్గుణ సంపద 🌿
ఓ మనిషీ...గుర్తుంచుకో..!
నీకు జన్మనిచ్చేది ఇద్దరు…
అవనిలో అమ్మ...
ఆకాశంలో బ్రహ్మ...!
నీకు జీవనపాఠాలు నేర్పేది ఇద్దరు…
నీవు చేసిన తప్పులు...
నీకు తగిలిన ఎదురు దెబ్బలు..!
నీకు జ్ఞానం అందించేది ఇద్దరు…
నీవు కలిసిన మహానుభావులు...
నీవు పఠించిన బృహత్ గ్రంథాలు..!
నీకు ప్రశాంతతను ప్రసాదించేవి రెండు…
దైవ సన్నిధిలో నీవు చేసిన
భక్తి పూజలు...నీ కన్నీటితో ప్రార్థనలు...!
నీకు శాంతిని వెదజల్లేవి రెండు…
నీవు దర్శించిన గుళ్ళు గోపురాలు...
పుష్కరాలు...పుణ్య తీర్థాలు...!
నీకు ఆనందాన్ని పంచేవి రెండు…
నీవు చేసిన విహార యాత్రలు...
నీవు చూసిన ప్రకృతిరమణీయ దృశ్యాలు.
నీకు గౌరవాన్ని తెచ్చేవి రెండే…
నీ నిర్మల నిష్కల్మష హృదయం...
నీ నిస్వార్థ ఆపన్న అమృతహస్తం...!
ఓ మనిషీ...గుర్తుంచుకో..!
ఆపదలో ఉన్నవారిని ఆదరించడం....
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం...
నీడలేని నిరుపేదలకు నీడ నివ్వడం...
నరుడే నారాయణుడని భావించడం...
నీలో ప్రకాశించే దైవిక సద్గుణాలు..!
ఓ మనిషీ...మరిచిపోకు..!
నీ సహనం...
ఒక చల్లని వర్షం...
నీ సమయస్ఫూర్తి...
ఒక సుమభరిత సుగంధం
నీ సమానత్వం...
ఒక సప్తరాగాల సంగీతం
నీ మంచితనం...
ఒక మలయమారుతం...!
నీ మానవత్వం...
ఒక మణిమయ మకుటం...
నీ ప్రేమతత్వం...ఒక దైవదరహాసం
నీ సౌభ్రాతృత్వం...సత్సంకల్పం...
నీ సమబుద్ది...నీ చిత్తశుద్ధి...
నీలో వెలిగే నవ జీవన జ్యోతులు...!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి