శంకరాచార్య విరచిత - ఉమా మహేశ్వర స్త్రోత్రం :- కొప్పరపు తాయారు ‌

 శ్లో కం :నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాళకల్యాణవపుర్ధరాభ్యామ్ ।
కైలాసశైలస్థితదేవతాభ్యాం
నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 7 ॥

 పదార్థ వివరణ
నమః శివాభ్యాం – శివపార్వతీ దేవతా దంపతులకు నమస్కారం
కలినాశనాభ్యాం – కలియుగంలోని పాపాలు, దోషాలు నాశనం చేసే వారికి
కంకాళ-కల్యాణ వపుర్ధరాభ్యామ్ – శివుడు కంకాళాలు ధరించినవాడు, పార్వతీ దేవి శోభనమైన రూపం కలిగినదీ — ఈ విరుద్ధ రూపాల్ని ధరించే దంపతులకు
కైలాస-శైల స్థిత దేవతాభ్యాం – కైలాస పర్వతంపై నివసించే దేవ దేవతలకు
నమో నమః శంకరపార్వతీభ్యామ్ – శంకరపార్వతీ దేవతలకు మళ్ళీ మళ్ళీ నమస్కారం
భావార్థం
కలియుగంలోని పాపాలను నాశనం చేసే,
శివుడు తన భయానక (కంకాళ) అలంకారంతో, పార్వతీ దేవి తన శోభన రూపంతో ఉన్న,
కైలాసపర్వత నివాసులైన
శంకరపార్వతీ దంపతులకు
పునః పునః నమస్కారాలు.
               *******

కామెంట్‌లు