పోలయ్య కూకట్లపల్లికి సాహితీ సత్కారం
 సంగీత సాహిత్య సాంస్కృతిక సమన్వయ సంస్థ వ్యవస్థాపకులు మైన్స్ మాజీ డైరెక్టర్ డా వి.డి రాజగోపాల్ అధ్యక్షతన శారదా కల్చరల్ లైవ్ స్టూడియో ఆదివారం రాత్రి పంచరత్నాలైన భగవాన్ శ్రీ పుట్టపర్తి సాయిబాబా..పండిట్ జవహర్ లాల్ నెహ్రూ...దాశరధి..‌.అబ్దుల్ కలాం...డా.అందెశ్రీల...సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రవీంద్రబాబు అరవా సమన్వయకర్తగా జరిగిన కవి సమ్మేళనంలో...ప్రముఖ కవి రచయిత పోలయ్య కవి కూకట్లపల్లి పాల్గొని డా.అందెశ్రీ పై..."పాటనై నే బ్రతికి ఉంటా...
ప్రతి తెలంగాణ ఇంట"...ప్రతిధ్వనిస్తూనే ఉంటా"... అన్న కవితను గానంచేసి తోటి కవుల, కవయిత్రుల, ప్రముఖుల ప్రశంసలందుకున్నారు.
తదనంతరం డా. వి.డి రాజగోపాల్ ఎ.ఎల్ క్రిష్ణా రెడ్డి చేతుల మీదుగా పోలయ్య కవి కూకట్లపల్లికి సాహితీ సత్కారం జరిగింది ఈ సభకు ముఖ్య విశిష్ట ఆత్మీయ అతిథులుగా డా. ఓలేటి పార్వతీశం, డా. నాళేశ్వరం శంకరం డా. కొమర్రాజు తదితర సాహితీ ప్రముఖులు హాజరై ప్రసంగించారు... మహనీయులను స్మరిస్తూ కవితా గానం చేసిన కవులను డాక్టర్ వి.డి రాజగోపాల్ సముచిత రీతిలో సన్మానించారు. ఈ సభలో రవీంద్ర బాబు పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరి ఆశీస్సులు పొందారు. 
గద్వాల సోమన్న పుస్తకం ఆవిష్కరణ  
డా శరత్ చంద్ర, డా. వి.డి రాజ గోపాల్ వ్రాసిన "అబ్దుల్ కలాం నీకు సలాం" పాటను స్వరపరచి అద్భుతంగా గానం చేశారు. అరవా తన గానంతో సభను అలరించారు..."అన్నదాత" డాక్టర్ వి.డి రాజగోపాల్ ఏర్పాటు చేసిన చక్కని విందుతో సభ దిగ్విజయంగా ముగిసింది.

కామెంట్‌లు