వేదాల ఆధారంగా 18పురాణాలు వెలువడ్డాయి.అందులో వరాహపురాణం ఒకటి.విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుని చంపాడు.పంది అని చిన్న చూపు కూడదని చెడు అనే రాక్షస సంహారమే వరాహావతారం అని,మన కర్మలవల్లనే మంచి చెడు ఎక్కువ తక్కువ భేదాలు ఏర్పడ్తాయని వరాహపురాణం చెప్తుంది.ఈప్రపంచం సృష్టి ఎలా ఏర్పడిందో చెప్తూ దుర్జనుల గూర్చిన అవగాహన కలిగిస్తుంది.వేదాలు అగ్ని ఉత్పత్తి,గౌరి గణపతి నాగులగూర్చివివరణ ఉంది.వాయుపురాణంలో శ్రీమహావిష్ణువు వరాహావతారం ఎత్తి పరమాణురూపంలోని పృథ్విని వెతికి తన నోటి దంతాలపై నిలబెట్టిన వర్ణన ఉంది.ఒక్క నిమిషంలో 6వేల ఉల్కలు రాలుతాయి. వాటిని వాటినివరాహీశక్తి అడ్డగించి చూర్ణంచేస్తుంది. సత్యంజ్ఞానం దయ నిగూర్చిన విశేష వర్ణన వాటి ప్రాధాన్యత వివరింప బడింది. సమాజంలో మన ఆచరణ బతికేవిధానం నేర్పుతుంది.వేదపఠనం కష్టం.అందుకే పురాణాలు చదివి భారతీయ సంస్కృతి ని అర్థం చేసుకుని ధర్మ మార్గంలో బతకాలి.అమ్మ నాన్నలు బీద,కురూపులైనా, దివ్యాంగులైనా వారిని మనం తక్కువ గాచూడం.పక్క వారి అమ్మ నాన్నలని నెత్తికెక్కించుకుని వారి అందం డబ్బు హోదాలని చూసి మురిసిపోటం, మనవారిని ఛీత్కరించటం తగదు.ఇదే మన వేదపురాణాలు ,రామాయణ భారత భాగవతాలు చెప్పాయి,వాటిని చదివి ఆచరణలో పెడితే మన దేశం ఇలా కొట్లాటలు,హింస దోపిడీ,అత్యాచారాలు లేకుండ హాయిగా ప్రశాంతంగా ఉంటుంది.మార్కులు రాంక్స్ వచ్చినా ఉన్నత పదవుల్లో ఉన్న వారు అవినీతిపరులుగా సైబర్నేరగాళ్లుగా లంచగొండులుగా మారడం విచారకరం.దానికి కారణం దైవభక్తి పాపభీతి లేక పోవడమే.రామకృష్ణ మఠం,చిన్మయామిషన్, సత్యసాయి సేవాసంస్థలు ఇలా బాల్యంలోనే మంచికథలు చెప్తూ క్రమశిక్షణ నేర్పుతున్నాయి🌷
వరాహపురాణం! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి