పృధ్వీరాజ్ చౌహాన్:- - యామిజాల జగదీశ్

 1999లో, మన భారతీయ విమానాన్ని ముస్లిం ఉగ్రవాదులు నేపాల్ నుండి ఆఫ్ఘనిస్తాన్‌కు హైజాక్ చేశారు. ఆ సమయంలో, కొన్ని భారతీయ వార్తాపత్రికలు తమ విలేకరులను వార్తలు సేకరించడానికి ఆఫ్ఘనిస్తాన్‌కు పంపాయి. అక్కడ హోటల్‌లో బస చేసిన విలేకరులు కాందహార్ నగరాన్ని పరిశీలించడానికి బయలుదేరారు. వారు నడుస్తున్న వీధికి ఒక వైపున మట్టి దిబ్బ కనిపించింది. ఆ దారిలో వెళుతున్న ఓ వ్యక్తి మట్టి దిబ్బను చూసి ఉమ్మి వెళ్లిపోయాడు. మరొకరు ఆ దిబ్బపై మూత్ర విసర్జన చేసి వెళ్లిపోయాడు. కాస్సేపటికి అటువైపుగా వచ్చిన ఇద్దరు మహిళలు తమ చెప్పులు తీసి మట్టి దిబ్బమీ కొట్టి వెళ్లిపోయారు.
ఇదంతా చూస్తున్న విలేకరులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వారు నేరుగా హోటల్‌కు వెళ్లారు. అక్కడ,  హోటల్‌ రిసెప్షనిస్టుకి తాము చూసిన సంఘటన గురించి ఇంగ్లీషులో చెప్పి వారందరూ ఎందుకలా చేశారని అడిగారు. రిసెప్షనిస్ట్ అది ఓ హిందూ రాజు సమాధి అని, ఇక్కడి ప్రజలు ఆ రాజు పట్ల తమ కోపాన్ని ఇలాగే వ్యక్తం చేస్తుంటారని చెప్పారు. ఇంతకూ ఆ రాజు మరెవరో కాదు... గొప్ప మహా రాజు శ్రీ పృథ్వీరాజ్ చౌహాన్.
పృథ్వీరాజ్ చౌహాన్ ఒక రాజపుత్ర యోధుడు. సింధు నది ప్రవహించే ప్రస్తుత పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌ను పాలించిన మహారాజు ఆయన. 
పదకొండేళ్ల వయసులో సింహాసనాన్ని అధీష్టించిన పృథ్వీరాజ్ అద్భుతమైన గుర్రపు స్వారీ, విలుకాడు. నువ్వెంత ఓ అందంగా ఉన్నానని స్నేహితుడు చెప్పడంతో వీరులు అందంగా ఉండకూడదని తనకు తానే పృధ్వీరాజ్ చౌహాన్ తన కత్తితో  ముఖంపై ఒక గాటు పెట్టుకున్నారు. 
పొరుగు దేశాన్ని పాలిస్తున్న ఆయన మేనమామ జయచంద్రుడు మునుపటి శత్రుత్వం కారణంగా పృథ్వీరాజ్‌ను తన కుమార్తె స్వయంవరానికి ఆహ్వానించడానికి నిరాకరించారు. ఈ కారణంగా, కోపంతో రగిలిపోయిన పృథ్వీరాజ్ చౌహాన్, తన మేనమామ కుమార్తె మనస్సులో తాను ఉన్నానని గూఢచారుల ద్వారా తెలుసుకున్నారు. 
మరుసటి రోజు, పృధ్వీరాజ్ చౌహాన్ తన గుర్రంమీద ఒంటరిగా వెళ్లి, తన మేనమామ రాజభవనంలోకి ప్రవేశించి, తన ప్రియమైన సంయుక్తను రాజభవనంలోకి రప్పించారు. ఈ విషయం తెలిసి ఆగ్రహించిన జయచంద్రుడు ప్రతీకారం కోసం ఎదురు చూసారు. ఈ పరిస్థితిలో, పశ్చిమం నుండి దండెత్తుతున్న ముహమ్మద్ ఘోరీని ఆయన రెండుసార్లు ఓడించి తరిమికొట్టారు.
మూడవసారి, ముహమ్మద్ ఘోరి సింధు నది ఒడ్డున వేటాడుతున్న పృథ్వీరాజ్ చౌహాన్‌ను రాత్రి నిద్రిస్తున్నప్పుడు, జయచంద్రుడి సహాయంతో బంధించాడు. అంతేకాదు, ఆయనకు భయపడిన ఘోరీ, పృథ్వీరాజుని అంధున్ని చేశాడు. 
పృధ్వీరాజుని స్వదేశానికి తీసుకుపోతున్న క్రమంలో ఓరోజు రాత్రి, ఆఫ్ఘనిస్తాన్‌లో బస చేశారు. ఆ సమయంలో, పృథ్వీరాజ్ స్నేహితుడు తన రాజు అంధుడైనప్పటికీ, అర్జునుడిలాగే విలువిద్యలో గొప్ప నిష్ణాతుడని చెప్పాడు. ఇది తెలుసుకున్న ఘోరీ పరీక్షించాలనుకున్నాడు. పృథ్వీరాజ్‌కు ఒక విల్లంబులు ఇచ్చి, శబ్దం వచ్చే దిశలో బాణం వదలాలని అడిగాడు ఘోరీ. దీనిని సవాలుగా తీసుకున్న పృథ్వీరాజ్ తన బాణాన్ని చాలా ఖచ్చితత్వంతో ప్రయోగించారు. దిగ్భ్రాంతి చెందిన ఘోరి ఆనందంతో "అద్భుతం" అని అరిచాడు.
ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్న పృథ్వీరాజ్ చౌహాన్, శబ్దం వచ్చే దిశలో తన బాణాన్ని ప్రయోగించారు. అంతే, క్షణంలో, బాణం దూసుకుపోయింది.  ముహమ్మద్ ఘోరి మరణించాడు. ఘోరి చనిపోవడాన్ని చూసి, అతని తోటి సైనికులు పృథ్వీరాజ్, ఆయన స్నేహితుడిని చంపి అక్కడే పాతిపెట్టారు. ఈ దిబ్బ కాందహార్ నగరంలో ఇప్పటికీ ఉంది. నమ్మక ద్రోహం వల్ల మరణించిన మొదటి హిందూ రాజు ధైర్యవంతుడు పృథ్వీరాజ్ చౌహాన్.
హైందవ రాజులు ధైర్యానికి పెట్టింది పేరు. వారు సాహసవంతులు. వారిని గెలవడం ప్రత్యర్థులకెప్పుడూ సవాలే. అయితే ప్రత్యర్థుల ద్రోహంతో ఓడిపోతారనడానికి పృధ్వీరాజ్ చౌహాన్ ఘటన ఓ ఉదాహరణ. ప్రతి హిందూ రాజు ధైర్యసాహసాలను ఇటువంటి చరిత్రలు చెప్పక చెబుతాయి. 
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న రోజుల్లో నాటి భారత ప్రభుత్వం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన అణ్వాయుధ సామర్థ్యం గల క్షిపణికి ఆయన జ్ఞాపకార్థం "పృథ్వీ" అని పేరు పెట్టటం గమనార్హం.

కామెంట్‌లు