"" కవితాక్షర మహిమ """: - డా. ఆళ్ళ నాగేశ్వరరావు- తెనాలి-జిల్లా: గుంటూరు-చరవాణి:7416638823
సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
=================
రవి గాంచనిది కవి గాంచును...
కవి గాంచినది అక్షరబద్ధమై...
పదబంధ కూర్పుతో కవితామాలికై...
కవితాత్మక వర్ణనలతో కావ్యఖండికై....
సాహితీక్షేత్రంలో సాహితీజల్లులు కురిసి  
అక్షర సుమములై విరబూయును!
శివునికి త్రినేత్రం...
కవికి కలం నేస్తం...
ఆయన త్రినేత్రం తెరిస్తే
దుష్టశిక్షణ జరుగుతుంది :
కవి కలాన్ని ఝళ్లిపిస్తే
సామాజిక వికాసం కలుగుతుంది!
అక్షరయోధుని మదిలో
అక్షర గువ్వలు విహరించి...
సాహితీ వినీలాకాశంలో...
యాబది ఆరు అక్షరాలతో
సువర్ణ అక్షర హరివిల్లును ఏర్పర్చి...
జనులందరిలో చైతన్యాన్ని రగిలించి...
ఉవ్వెత్తున ఎగసిపడే ఉద్యమాలకు ఊపిరిపోస్తూ...
సమసమాజ నిర్మాణానికి శ్రీకారం చుడుతూ...
సమాజాన్ని ప్రగతిపధములో పయనింప చేస్తూ...
విశ్వశాంతి పరిరక్షణకై పునఃరంకితమౌతున్నారు అక్షరార్చకులైన కవిపుంగవులు!
 


కామెంట్‌లు