శ్రీమద్భాగవతం మొదటి స్కంధం మొదటి అధ్యాయం "నైమిశారణ్య మునుల ప్రశ్నలు" అనే పేరుతో అత్యంత పవిత్రంగా ప్రారంభమవుతుంది. సృష్టికి, స్థితికి, లయానికి మరియు సమస్త జ్ఞానానికి మూలకారణమైన శ్రీకృష్ణుడిని ఇందులో పరమాత్మగా వర్ణించారు. లోకక్షేమం కోసం నైమిశారణ్య తీరంలో వెయ్యేళ్ల పాటు సాగే మహాయజ్ఞాన్ని చేస్తున్న శౌనకాది మునులు, కలియుగంలోని సామాన్య ప్రజల ఉద్ధరణ మార్గం ఏమిటో తెలపాలని సూత మహర్షిని ప్రార్థించారు. మనుషుల ఆయుష్షు, శక్తి తగ్గే ఈ కాలంలో అన్ని శాస్త్రాల సారాంశం ఏమిటి, భగవంతుడు శ్రీకృష్ణుడిగా ఎందుకు అవతరించాడు, ఆయన వెళ్ళిపోయాక ధర్మం ఎక్కడ ఆశ్రయం పొందింది వంటి లోతైన ప్రశ్నలను వారు సంధించారు. ఈ సందర్భంగా గ్రంథకర్త మొదటి శ్లోకంలోనే “ఓం నమో భగవతే వాసుదేవాయ” అంటూ సర్వజ్ఞుడైన వాసుదేవుడికి నమస్కరిస్తూ, సృష్టికర్త అయిన బ్రహ్మ హృదయంలో వేదజ్ఞానాన్ని ఆయనే మొదట ప్రకాశింపజేశాడని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భాగవతం ఇలా వివరిస్తుంది:₹{జన్మాద్యస్య యతోऽన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞః స్వరాట్}₹₹{తేనే బ్రహ్మ హృదా య ఆదికావయే ముహ్యంతి యత్సూరయః}₹దీని అర్థం ఏమిటంటే, ఈ విశ్వం పుట్టుకకు, ఉనికికి ఏకైక కారణమై, స్వయంగా ప్రకాశించే ఆ పరమాత్ముడు, బ్రహ్మదేవుడి అంతరాత్మలో వేదజ్ఞానాన్ని నింపాడు. ఆ అద్భుత జ్ఞానప్రకాశం ముందు ఎంతో మంది పండితులు సైతం దిగ్భ్రమ చెందుతారు. సృష్టి ఆరంభంలో అజ్ఞానంలో ఉన్న బ్రహ్మకు భగవంతుడు తన తేజస్సును ప్రసాదించగా, బ్రహ్మ తన నాలుగు ముఖాల ద్వారా వేద మంత్రాలను లోకానికి అందించాడు. వేదాలు సామాన్య మనుషులు రాసినవి కావు; అవి అపౌరుషేయమైన దైవ వాక్యాలు. ఇవి గురుశిష్య పరంపర ద్వారా వినడం వల్ల మనకు అందాయి కాబట్టి వీటిని 'శ్రుతులు' అని అంటారు. ఇవి వ్యక్తిగత ప్రవర్తనకు మరియు సమాజ శాంతికి బలమైన దిక్సూచీలుగా నిలుస్తాయి.కలియుగ ప్రజల అల్ప మేధస్సును గమనించిన వేదవ్యాస మహర్షి, అనంతమైన వేద సంపదను అర్థం చేసుకోవడం కష్టమని భావించి దానిని నాలుగు భాగాలుగా విభజించారు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణవేదం. ఋగ్వేదం ప్రధానంగా ప్రకృతి శక్తులను, ఇంద్రాది దేవతలను స్తుతించే మంత్రాలతో నిండి ఉంటుంది. యజుర్వేదం యజ్ఞయాగాదులు ఎలా నిర్వహించాలో, ఆ కర్మకాండల పద్ధతులను వివరిస్తుంది. సామవేదం ఋగ్వేద మంత్రాలను రాగయుక్తంగా ఎలా గానం చేయాలో నేర్పిస్తుంది, దీనినే భారతీయ సంగీతానికి ఆదిమూలం అని పిలుస్తారు. అధర్వణవేదం మానవ ఆరోగ్యం, రక్షణ, పాలన మరియు దైనందిన జీవితానికి అవసరమైన శాస్త్రీయ విషయాలను బోధిస్తుంది. ప్రతి వేదం మనిషికి క్రమశిక్షణతో కూడిన, అర్థవంతమైన జీవితాన్ని ఎలా గడపాలో మార్గనిర్దేశం చేస్తుంది.ముగింపుగా, భాగవతం మొదటి అధ్యాయం భగవంతుడిని సకల సృష్టికి మూల కేంద్రంగా నిలబెట్టింది. వేదాల ద్వారా లభించే జ్ఞానం చివరకు భక్తి మార్గానికి దారితీయాలని ఇది బోధిస్తుంది. అన్ని శాస్త్రాల సారం భగవద్భక్తియే అని చాటిచెప్పడం ద్వారా, నేటి ఆధునిక కాలంలో గందరగోళానికి గురవుతున్న యువతకు ఈ అధ్యాయం గొప్ప ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ నిత్య సత్యాలు మనిషిని అజ్ఞానం నుండి వెలుగులోకి నడిపిస్తాయి.
శ్రీమద్భాగవతం: భక్తి రసామృత సారము (8వ భాగం):- సి.హెచ్.ప్రతాప్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి