నీతి పద్యాలు : - డి.వినాయక్ రావు, భైంసా, 9059494259

 కం: శాంతము లేనట్టి మనసు 
చింతను తానొంది తిరుగు చెట్టుబిడారై 
వింతగ తానాడించును
గంతనుకట్టంగ మనిషి కన్నులు మూయన్ 

భావము: శాంతి లేని మనసు చింతను పొంది కోతిలాగ తిరుగుతు ఉండును. మనిషి కన్నులకు గంతనుకట్టి వింతగా ఆడిస్తుంది.
కం: క్రమశిక్షణలేని బ్రతుకు 
భ్రమలోనేతిర్గుచుండ వ్రాత్యంబవ్వున్ 
దమమును తప్పును నదియున్
క్రమముగ క్షీణించ, ప్రాణి కనుమరుగవ్వున్

భావము:చక్కని ప్రవర్తనను కలిగుండని జీవితము ,భ్రాంతి నొంది సంస్కారాన్ని కోల్పోవును.ఇంద్రియ నిగ్రహము లేక కాలక్రమమున అది ప్రాణిని కనిపించకుండ చేస్తుంది.
కామెంట్‌లు