తెలుగు ప్రజల చెవులలో చెక్కెర పోసి
తెలుగు చిత్రజగత్తును ఉర్రూతలూగించి
సంగీతప్రియుల హృదయాలను కొల్లగొట్టి
తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యానికి
మకుటంలేని మహారాజుగా వెండితెర
వెనుక ఓ వెలుగు వెలిగి గగనానికేగిన
గానగంధర్వుడు ఘనుడు త్యాగధనుడు
ఘంటసాల గారి జయంతి సందర్భంగా...
వారి సుస్వర సుమధుర గాత్రం నుండి
జాలువారిన కొన్ని అమృతగుళికల్లాంటి
సినీగీతాలను...స్మరించుకుందాం...
అశృనయనాలతో అంజలిఘటిస్తూ....
"తిరుమల మందిర సుందర
"సుమధుర కరుణా సాగర
"ఏ తీరున నినుకొలిచేమురా...
"ఏ పేరును నినుపిలిచేమురా"...
"ఘనా ఘన సుందరా
"కరుణా రస మందిరా
"అది పిలుపో మేలుకొలుపో
"అది మధుర మధురమౌ
"ఓంకారమో పాండురంగ పాండురంగ"...
"నమో వెంకటేశా నమో తిరుమలేశా
"మహానందమాయే ఓ మహా దేవదేవ"...
"ఏడుకొండల సామీ ఎక్కాడున్నావయ్యా
"ఎన్నిమెట్లెక్కినా కానా రావేమయ్యా"....
"లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
"దద్దరిల్లింది...పురుష ప్రపంచం"...
"పాడుతా తీయగా చల్లగా పసిపాపలా
"నిదురపో తల్లిగా బంగారు తల్లిగా"...
"ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో
"ఈ బండలమాటున ఏగుండెలు మ్రోగెనో..
"పాడవోయీ భారతీయుడా
"ఆడిపాడవోయి విజయగీతికా
"స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి
"సంబరపడగానే సరిపోదోయి
"సాధించిన దానికి సంతృప్తిని చెంది
"అదే విజయమనుకుంటే పొరపాటోయి"..
"మనసున మనసై, బ్రతుకున బ్రతుకై "తోడొకరుండిన అదేభాగ్యము అదేస్వర్గము"..
"ఉన్నావా అసలున్నావా
"ఉంటే కళ్ళు మూసుకున్నావా
"ఈ లోకం కుళ్ళు "చూడకున్నావా...
"ఈ జీవన తరంగాలలో
"ఆ దేవుని చదరంగంలో
"ఎవరికి ఎవరూ సొంతము
"ఎంతవరకీ బంధము...
"జగమే మాయ బ్రతుకే మాయ...వేదాలలో
"సారమింతేనయా...ఈ వింతేనయా"...
అలా ఏ పాట పాడినా
అది అమృతపు జల్లే
పుష్పవిలాపాన్ని వినిపించినా
భగవద్గీత శ్లోకాలను గానం చేసినా
శిలలపై శిల్పాలు చెక్కినట్లు...
ఎందరో సంగీతప్రియుల
హృదయ శిలాఫలకాలపై
చేసిన చెరగని సంతకమే
గంగా జలపాతంలా ప్రవహించే
ఘంటసాల గారి గాత్రం...
ఈ గానగంధర్వుడు చరితార్దుడు... చిరంజీవి...సదా చిరస్మరణీయుడు...
మరణమన్నదిలేని మహా గాయకుడు...
వారికివే నా అక్షర నీరాజనాలు...
===========================
(ఘంటసాల గారి జయంతి సందర్భంగా..)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి