ఎరువులు ఎడారిలో ఒయాసిస్‌లు
విత్తనాలలో కల్తీ విత్తనాలు
గిట్టుబాటు ధర లేక
వ్యవసాయమే బారమై
బ్రతుకే కషాయమాయె
పొలాలు మాయమై
బడా బాబుల చేతిలో
వెంచర్లుగా మరిపొయె
పొలంలో పురుగుపుట్ర కాటుకు బలైన
సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక
పశువుల తాడుని ముద్ధాడిన
శవరాజకీయల చేతుల్లో నలిగి
మనశ్శాంతి లేకపొయె
మట్టిమనిషి మాయం కాకుండా
కాపాడుకునేందుకు మనం అంతా
ప్రయత్నం చేద్దాం
===========================
మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి