పుణ్యానికి పోతే పాపం ఎదురయిందని ఎందుకంటారు ?:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977
 మన మహాభారత గాధలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువు కోర్కెపై పౌశ్య మహారాజు వద్దకు వెళ్లి కర్ణాభరణాలు అడుగుతాడు. దానికి పౌష్య మహారాజు ఒప్పుకొని, అతిథికి అందునా బ్రాహ్మణ పుత్రునికి ఆతిథ్యం ఇస్తే మహా పుణ్యమని తలుస్తాడు. భోజనం చేసి వెళ్ళమని చెబుతాడు. చక్కటి భోజనం సిద్ధం చేయిస్తాడు. భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడికి భోజనంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది.
దానితో అతడు మండిపడి ఔషమహారాజును భవిష్య మహారాజును గుడ్డివాడు కమ్మని శాపం ఇస్తాడు. ఆ శాపానికి పౌష్య మహారాజు కన్నెర్ర చేస్తాడు. మునివాసం చేసిన వాడవు కదా అని నేను గౌరవిస్తే, పిలిచి నీకు విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురయిందని నాకే శాపం ఇస్తావా అని ప్రతి శాపం ఇస్తాడు.
తర్వాత వారు ఇద్దరూ చింతిస్తారు కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలానే జరుగుతుంది. మంచి పనైనా తరచి తరచి తగు వ్యక్తులకు చేస్తేనే పుణ్యము.

కామెంట్‌లు