తాను పుంభావ సరస్వతి
నిత్యసాహితీ సేద్యంగాడు
భాషాబోధనతో వేలకొలది ప్రత్యక్ష పరోక్ష శిష్యులు వారి సొంతం
వారందరికీ ఇష్టసఖులు
కోపతాపాలెరుగని సహనమూర్తి
ఒకసారి అతనితో మాట్లాడితే
సాహితీవనంలో వివరించినట్లుంటది
అతని కవనం
విశ్వమానవ సందేశం
అతని సాహితీ ప్రసంగాలు
వర్థమాన కవులకు దిక్సూచి
తనకు భారతభాగతాదులు
కంఠస్థాలు
తమశిష్యకోటికి
అనునిత్యం తెలుగును బోధించి
భాషించి, శ్వాసించి
ధ్యానించి,
తెలుగుభాషా దీపాన్ని మలగకుండా కాపాడిన గొప్ప భాషాప్రియులు
ఉత్తమ తెలుగు భాషా బోధకులు
మహామహోపాధ్యాయులు
తెలుగులో విభిన్న సాహితీ ప్రక్రియల్లో రచనలు చేసి సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన కవీశ్వరులు
డాక్టర్ లింగంపల్లి రామచంద్ర గారి గూర్చి ఎంతని వ్రాయను
ఎంతని చెప్పను
ఆకాశమంతటి అతని వ్యక్తిత్వాన్ని
సంక్షిప్తికరించడం
నాలాంటి వర్థమాన కవులకు
గొప్ప సాహసమే
అందుకే ఆ మహాకవి గారికి
వేలవేల సమస్సులతో
తమ ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తీసే ఈసావనీర్ లో నాకు స్థానం కల్పించినందుకు
గురువు గారికి కృతజ్ఞతలు
నమస్కారాలు తెలుపుతూ
మీరు దీర్ఘాయువు
ఘనకీర్తి
పొందాలని
మనసారాకాంక్షిస్తూ
హృదయపూర్వకమైన 80వ జన్మదిన శుభాకాంక్షలతో ....
మీ
ఆత్మీయులు
శ్రేయోభిలాషి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి