ఈస్మార్ట్ ఫోన్ నా చేతిలోకి వచ్చాక
చేతిరాతకు దూరమవుతానేనే...!?
నాలోని సృజనాత్మకత
అడుగంటి పోతుందేమోనని భయమేస్తుంది!?
దగ్గర వాళ్ళు దూరమవుతున్నట్టు
దూరం వాళ్ళు దగ్గరవుతున్నరేమోనని ఆందోళన
మొదలవుతుంది
దీని వాడకంతో
నా విస్తృతి పెరిగింది
ఈ పెరుగుదల పురోగమనమో!?
తిరోగమనమో !?నాకు అర్థం కాకుంది.
ఏదేమైనా గూగుల్ గూటిలో
ఆన్లైన్ చక్ర బంధములో నాగమ్యం
ఎటో నేను తేల్చుకోలేని ప్రయాణమో!?
ఇదో అంతు చిక్కని సవాలైనది
ఏదేమైనా రోట్లో తల దూర్చాక
రోకలిపోటుకు జడిస్త్తే ఎలా!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి