నేను చెట్టును:- అంకాల సోమయ్య-దేవరుప్పుల -జనగామ-9640748497
 నేను చెట్టును 
నేను విశ్వాన్ని 
నేను చెట్టును 
మానవ ప్రగతికి  మెట్టును
నేను చెట్టును 
జన ఔషధిని
నేను చెట్టును 
పరోపకారిని
నేను చెట్టును 
ఛేదించినా చిగురించేదాణ్ణి
నేను చెట్టును 
పెరటి తోటలో పెట్టని కోటను
నేను చెట్టును 
సకలప్రాణికోటికి ప్రాణవాయువును
నేను చెట్టును 
భూమాత ఎదపై పచ్చలహారాన్ని 
నేను చెట్టును 
మీ చెలికాడను
నేను చెట్టును 
నేను మీ హిత్తైషిణి

కామెంట్‌లు