అనగనగా రామాయంపేట గ్రామంలో స్వామి, లావణ్య అనే దంపతులు ఉండేవారు. వాళ్లకు సోనీ, చైత్ర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోనీ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసింది. చైత్ర ఏడవ తరగతి చదువుతున్నది. సోనీ ఇంటర్మీడియట్ చదువుకోవాలనుకున్నది.
కానీ సోనీ తల్లిదండ్రులు పైచదువులు చదివిపించలేమని, పట్నంకు నిన్ను పంపలేమన్నారు. సోనీ చాలా బాధపడి, ఏడ్వసాగింది. చేసేది లేక సోని పొలం పనులకు వెళ్ళుతుంది.
ఒకరోజు రమేష్ మాస్టర్ సోనీ పొలం పనులకు పోవడం చూసి, సోని తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించుకుని మాట్లాడాడు. తాము సోనీని పైచదువులు చదివిపించే ఆర్థిక స్థోమత లేదని చెప్పారు. వారి ఆర్థిక స్థితిగతులు గమనించిన రమేష్ మాస్టర్ పట్నంలో ఉన్న మిత్రులకు సమాచారం తెలిపి ప్రభుత్వ హాస్టల్లో ఉండి, చదివేలా ఏర్పాటు చేశాడు. సోనీ తల్లిదండ్రులు రమేష్ మాస్టర్ సలహాకు కృతజ్ఞతలు తెలిపారు.
సోనీ పట్నంలో బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం పొందుతుంది. రమేష్ మాస్టర్ సలహా సోనీ జీవితాన్ని మార్చిందని, సోనీ తల్లిదండ్రులు అందరికీ చెప్పారు. అప్పటినుంచి విద్యార్థుల భవిష్యత్తుపై మాస్టర్ ల సలహా తీసుకుంటూ బిడ్డలను చదివించేసాగారు. సోనీ కూడా గ్రామంలో చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయసాగింది. గ్రామంలో అందరూ చదువుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు.
నీతి: మంచి సలహా ఎప్పుడు సమాజానికి వెలుగు చూపుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి