ఆశ్రయం:- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
 చక్రపురి అడవిలో జంతువులన్ని సంతోషంగా జీవిస్తున్నాయి. అడవిలో ఎక్కువ వర్షపాతం మూలంగా పండ్లు, ఫలాలతో అడవి సంపద కళకళలాడేది. ఎలాంటి విభేదాలకు తావులేకుండా జంతువులన్ని కలిసి మెలిసి ఉంటూ ఆనందంగా ఉండేవి.
           ఒకరోజు దారితప్పి ఒక నక్క చక్రపురి అడవిలోకి వచ్చింది. నక్క శరీరం మొత్తం బురదతో ఉంది. నక్కను చూసి జంతువులు భయపడ్డాయి. నేను దారి తప్పి వచ్చాను. నాకు కాసింత నివాసం ఇచ్చి, కాపడమని నక్క ప్రాదేయపడింది. జంతువులు జాలితో కాసిన్ని పండ్లు, ఫలాలు ఇచ్చి, నివాసం చూపించి విశ్రాంతి తీసుకొమ్మని, జంతువులు తమ నివాసాలకు వెళ్ళాయి.
           అర్థరాత్రి అవుతుంది. నక్క మెల్లగా లేచి, పక్కనున్న గుహలోకి పోయింది. నక్క లోపలికి వెళ్ళగానే గుహ మూతపడింది. గుహలోపల సింహాల గుంపు ఉంది. నక్క ఆశ్చర్యపోయింది. నక్కను చూసిన సింహాలకు ఆకలి పుట్టింది. నక్కపై దాడిచేసి చంపి తిన్నాయి. నక్క అరుపు విని జంతువులు ఆనందించాయి. ఆశ్రయం పొంది అర్థరాత్రి జంతువులపై దాడిచేసి చంపాలనుకుని, దారితప్పినట్లు నటించే ప్రతి జంతువు సింహాల ఆకలి తీర్చసాగాయి. అడవిలోని చిరు జంతువులకు హాని చేయకుండా మోసపూరిత జంతువులను చంపుతూ సింహాలు జీవించసాగాయి.

నీతి: ఆశ్రయం పొంది మోసం చేయాలనుకున్న వారే మోసపోతారు.
 
నేను రాసిన " ఆశ్రయం " కథ నా స్వీయ రచన ఎలాంటి అనువాదం కానీ అనుసరణ కానీ ఇతర పత్రికలకు పంపలేదని హామీ ఇస్తున్నాను.

కామెంట్‌లు