సుప్రభాత కవిత : - బృంద
నవ్వే పువ్వుల ఆహ్వానం 
నడిచే దారిలో ఆహ్లాదం 
తరిగే తీరపు దూరం 
తనివే తీరును నిజం!

బరువులేవీ బాధపెట్టక 
కరువులేవీ క్షోభ పెట్టక 
గడచి పోవగ కాలం 
నడచి పోవలే మనం!

కలతలుండవు  కలకాలం 
కలలు పండే మన సమయం 
కదిలి వచ్చును మనకోసం 
కనుల నింపును సంతోషం

వేడుకైనా వేదనైనా 
ఆగిపోదు ఎవ్వరికోసం 
ఎవరి ప్రాప్తం ఎంత వరకో 
అంతే దొరుకును ఇది సత్యం!

అడుగు ఆగక సాగాలి 
అలుపు లేక నడవాలి 
అడ్డంకులు ఎన్నొచ్చినా
తప్పించుకునే తీరాలి!

వరం లాంటి జీవితం
వదులుకోకు అవకాశం
ప్రేమను పంచుతూ
ప్రేమను పొందుతూ.....

సాగిపో అనుక్షణం..

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు